Gurjant Singh
-
జగజ్జేత జర్మనీకి భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్‌లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. -
ముంబై ఆశలు సజీవం
ముంబై: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో దబాంగ్ ముంబై తమ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6-3తో నెగ్గింది. ఈ ఓటమితో విజార్డ్స్ సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది. ముంబై తరఫున గుర్జంత్ సింగ్ (14వ నిమిషంలో), ఫ్లోరియన్ ఫచ్స్ (42), యూసుఫ్ అఫాన్ (59) ఫీల్డ్ గోల్స్‌తో అదరగొట్టారు. యూపీ విజార్డ్స్ నుంచి వీఆర్ రఘునాథ్ (19) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచగా.. చింగ్లెన్సన సింగ్ (30) ఫీల్డ్ గోల్ చేశాడు. 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ప్రస్తుతం ముంబై జట్టు కళింగ లాన్సర్‌తో సమానంగా 25 పాయింట్లతో ఉంది.