Carmakers announce plan to hike prices from January 2023 - Sakshi
Sakshi News home page

కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్‌!

Published Thu, Dec 8 2022 10:54 AM | Last Updated on Thu, Dec 8 2022 11:59 AM

Carmakers Plans To Hike Vehicle Prices From January - Sakshi

న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్‌ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి.

కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్‌ ఇండియా, హోండా కార్స్‌ తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement