Reno
-
ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?
సాక్షి, ముంబై: ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. రెనో 8 సిరీస్‌లో శుక్రవారం దీన్ని తీసుకొచ్చింది. 120Hz 3D Curved Screen, 108 ఎంపీ పోర్ట్రయిట్ భారీ కెమెరా, బిలియన్ కలర్స్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. 45 నిమిషాలలోపు ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 10నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఒప్పో రెనో 8టీ 5జీ స్పెసిఫికేషన్స్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 8 జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 4,800mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ధర రూ. 29,999 -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్ ఇండియా, హోండా కార్స్ తెలిపాయి. -
ఇండియాలోనే ఫాస్టెస్ట్ 5జీ ఫోన్... రిలీజ్ ఎప్పుడంటే?
పవర్ ఫుల్ ప్రాసెసర్, దుమ్మురేగిపోయే ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌ని రిలీజ్ చేసేందుకు ఒప్పో రంగం సిద్ధం చేసింది. జులై 14న సరికొత్త ఒప్పో రెనో 6 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది. ఇప్పటి వరకు మిడ్‌రేంజ్ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్లో ఒప్పో నుంచి వచ్చిన రెనో సీరిస్ ఫోన్లు వినియోగదారులను బాగానే ఆకట్టుకున్నాయి.పవర్ఫుల్ ప్రాసెసర్ఇటీవల కాలంలో పవర్ ఫుల్ ప్రాసెసర్‌గా గుర్తింపు పొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 900ని ఈ మొబైల్లో ఉపయోగించారు. ఈ ప్రాసెసర్ 5జీని సపోర్ట్ చేయడంతో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా, 120 గిగాహెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఫాస్ట్ ఛార్జింగ్, వైఫై 6 కనెక్టివిటీ, ఆల్ట్రా ఫాస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, బ్యాటరీ మేనేజ్మెంట్ పనులు అద్భుతంగా నిర్వహిస్తుందనే పేరుంది. హాట్‌స్పాట్‌ని ఆన్ చేసి ఉంచనప్పుడు బ్యాటరీ డ్రైయిన్ కాకుండా ఎక్కువ సేపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన కంపెనీలతో పోల్చితే కనీసం 30 శాతం బ్యాటరీ ఎక్కువగా వస్తుందని చెబుతోంది.ఫాస్టెస్ట్ 5జీమీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ని ఉపయోగించడం ద్వారా ఇండియాలోనే అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెస్తున్నామని ఒప్పో రీసెర్చ్ , డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ తస్లీమ్ ఆరీఫ్ అన్నారు. అత్యంత వేగవంతమైన ఫోన్లో గేమింగ్, వీడియోగ్రఫి, వీడియో కంటెంట్ చూసేప్పుడు మంచి అనుభూతి కలుగుతుందని ఆయన అన్నారు.మీడియాటెక్ప్రస్తుతం హై ఎండ్ ప్రీమియం ఫోన్లు ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నాయి. అయితే వాటికి ధీటుగా మీడియాటెక్ ఇటీవల డైమెన్సిటీ 900ని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీంతో కొత్త ప్రాసెసర్‌తో రెనో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ని ఒప్పో ఫోన్ తీసుకు వస్తోంది. -
జనవరి నుంచి కార్ల ధరలు మోతే!
సాక్షి, ముంబై: వాహన ధరల మోతకు మరో కంపెనీ సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వివిధ మోడళ్లపై రూ.28 వేల వరకు ధరల్ని పెంచుతున్నట్లు శుక్రవారం రెనో కంపెనీ ప్రకటించింది. ఫలితంగా కంపెనీ తయారీ చేసే క్విడ్, డస్టర్, ట్రిబర్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్, ఇతర ఖర్చుల కారణంగా ఉత్పత్తి వ్యయం పెరగడంతో మోడళ్ల ధరలను పెంచాల్సివచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (యూట్యూబ్ వీడియోలు తెగ చూస్తున్నారు) హీరో మోటో కూడా... ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ జనవరి నుంచి ధరలను పెంచనుంది. వాహన మోడళ్లను బట్టి రూ.1,500 వరకు పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇన్పుట్ వ్యయం పెరగడం వల్లే ధరల పెంపునకు ప్రధాన కారణమని పేర్కొంది. స్టీల్, అల్యూమీనియం, ప్లాస్టిక్ వంటి అన్ని వస్తువుల వ్యయం క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది. ముడిసరుకు, కమోడిటీ ధరలు, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ఇప్పటికే మారుతీ, ఫోర్డ్, మహీంద్రా కంపెనీలు జవవరి 1 నుంచి తమ వాహనాలపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్’
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్ సెవన్ – సీటర్ మల్టీ పర్పస్ వెహికిల్ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0–లీటర్ 3–సిలెండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ, ఎండీ వెంకట్రామ్ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్ కోసమే ప్రత్యేకంగా కార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి మార్కెట్లో ఏడాదికి ఒక నూతన కారును ప్రవేశపెట్టనున్నాం. 2022 వరకు వీటి విడుదల ఉండేలా నిర్ణయించాం. గ్రామీణ విక్రయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. భారత మార్కెట్లోకి రెనో ఎలక్ట్రిక్ కారు..! ప్రణాళిక ప్రకారం తమ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు వెంకట్రామ్ మామిళ్లపల్లి ప్రకటించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. నాణ్యత లేని ఈవీని విడుదలచేసి, వాటిని గ్యారేజీలకు పరిమితం చేయడం కంటే, సమయం తీసుకుని అయినా పటిష్టమైన వాహనాన్ని విడుదలచేస్తామన్నారు. 2022 నాటికి రెనో ఈవీ మార్కెట్లోకి వస్తుందని ప్రకటించారు. -
మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా భారత మార్కెట్లోకి ‘రెనో 2’ సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదలచేసింది. ‘రెనో 2, రెనో 2 జెడ్, రెనో 2 ఎఫ్’ పేర్లతో మూడు స్మార్ట్ఫోన్లను తాజా సిరీస్‌లో భాగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రెనో 2 ధర రూ.36,990 కాగా, సెప్టెంబర్ 20 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రెనో 2 జెడ్ ధర రూ.29,990 ఉండగా, ఈ ఫోన్ ప్రీ–బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. సెప్టెంబరు 6న వినియోగదారులకు ఇది లభ్యంకానుంది. రెనో 2 ఎఫ్ నవంబరులో అందుబాటులోకిరానుంది. తాజా సిరీస్‌తో కంపెనీ మార్కెట్ వాటా ఈఏడాదిలో 10 శాతానికి చేరుకోవాలనేది తమ లక్ష్యమని సంస్థ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ వాలియా అన్నారు. -
పెరగనున్న రెనో కార్ల ధరలు
ముంబై: యూరోపియన్ ఆటో తయారీ దిగ్గజం రెనో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి 1.5 శాతం మేర పెంపు ఉండనుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల, ఫారెన్ ఎక్సే్ఛంజ్‌లో భారీ మార్పులు ఈ ధరల పెంపు నిర్ణయానికి దోహదపడ్డాయని తెలిపింది. రెనో డస్టర్, క్విడ్, లాజీ, క్యాప్టర్ బ్రాండ్లను కంపెనీ భారత్‌లో విక్రయిస్తోంది. మరోవైపు స్కోడా, మారుతీ సుజుకీ, ఇసుజు మోటార్స్, టయోటా కిర్లోస్కర్ సంస్థలు కూడా వచ్చే ఏడాది ఒకటవ తేదీ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
రెనో ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌బీర్
హైదరాబాద్: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ రెనో- బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ వ్యవహరించనున్నారు. ఇది కంపెనీకి మరింత ప్రయోజనం కలగజేస్తుందని సంస్థ ఎండీ సాహ్నీ ఒక ప్రకటనలో తెలిపారు. రెనోతో భాగస్వామ్యం ఆనందంగా ఉందని రణ్‌బీర్ కపూర్ పేర్కొన్నారు. భారత్‌లో నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రెనో, భవిష్యత్తు కార్యచరణపై మరింత దృష్టి కేంద్రీకరించింది. -
రెనో చిన్న కారు మే 20న వస్తోంది...
పాత కార్ల విక్రయాల్లోకి ప్రవేశిస్తున్నాం - కార్లెస్ షోరూంలు ఏర్పాటు - రెనో వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న చిన్న కారుకు ముహూర్తం ఖరారైంది. 800 సీసీ సామర్థ్యంతో రూపొందుతున్న ఈ కారును ముందుగా భారత్‌లో ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల్లో విడుదల చేయనున్నారు. మే 20న చెన్నైలో ఆవిష్కరిస్తున్న విషయాన్ని రెనో ఇండియా సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ రాఫెల్ ట్రెగ్వెర్ ధ్రువీకరించారు. మల్టీ పర్పస్ వెహికిల్ రెనో లాడ్జీ మోడల్‌ను హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. కాగా, చిన్న కారు జూన్-జూలైకల్లా భారతీయ రోడ్లపై పరుగు తీయనుందని సమాచారం. రెనో ఒక మోడల్‌ను భారత్‌లో ఆవిష్కరించడం కూడా ఇదే మొదటిది. కారు ధర రూ.2.5-4 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కార్యకక్రమంలో పంపిణీ సంస్థ శ్రీశ్రీశ్రీ రెనాల్ట్స్ ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్లు లేని షోరూంలు.. భారత్‌లో టీవీఎస్ అండ్ సన్స్ సహకారంతో డిజిటల్ షోరూంలను రెనో తెరవనుంది. కార్లకు బదులుగా షోరూంలో తెరను ఏర్పాటు చేస్తారు. కస్టమర్ తనకు కావాల్సిన మోడళ్లను ఆ స్క్రీన్‌పై వీక్షించొచ్చు. అలాగే పాత కార్ల విక్రయాల్లోకి కంపెనీ ప్రవేశిస్తోంది. వారం రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. హైదరాబాద్‌తోసహా ఏడు నగరాల్లో డీలర్లను నియమించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 5 శాతం వాటా లక్ష్యం..: కంపెనీ 2014లో దేశంలో సుమారు 50 వేల వాహనాలను విక్రయించింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 7 శాతం. ఇక భారత్‌లో రెనోకు 2 శాతం మార్కెట్ వాటా ఉంది. 2016 నాటికి 5 శాతం లక్ష్యంగా చేసుకున్నట్టు రాఫెల్ చెప్పారు. 2015లో కొత్తగా 45 డీలర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. చెన్నై సమీపంలోని రెనో-నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటు వార్షిక సామర్థ్యం 4.8 లక్షల యూనిట్లు. ప్లాంటు విస్తరణకు ఇరు సంస్థలు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి.