పెరగనున్న రెనో కార్ల ధరలు | Warming up reno car could cost you | Sakshi
Sakshi News home page

పెరగనున్న రెనో కార్ల ధరలు

Published Wed, Dec 12 2018 1:25 AM | Last Updated on Wed, Dec 12 2018 1:25 AM

 Warming up reno car could cost you - Sakshi

ముంబై: యూరోపియన్‌ ఆటో తయారీ దిగ్గజం రెనో తమ కార్ల ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి 1.5 శాతం మేర పెంపు ఉండనుందని తెలియజేసింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల, ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌లో భారీ మార్పులు ఈ ధరల పెంపు నిర్ణయానికి దోహదపడ్డాయని తెలిపింది. రెనో డస్టర్, క్విడ్, లాజీ, క్యాప్టర్‌ బ్రాండ్లను కంపెనీ భారత్‌లో విక్రయిస్తోంది. మరోవైపు స్కోడా, మారుతీ సుజుకీ, ఇసుజు మోటార్స్, టయోటా కిర్లోస్కర్‌ సంస్థలు కూడా వచ్చే ఏడాది ఒకటవ తేదీ నుంచి ధరలను పెంచుతున్నట్లు    ప్రకటించాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement