
ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం పెట్రోల్, ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే కాకుండా సీఎన్‌జీ బైక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది.. ఎలక్ట్రిక్ బైక్ కొనాలా? పెట్రోల్ బైక్ కొనాలా? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ కథనంలో దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ బైక్స్
ప్రస్తుతం మార్కెట్లో దాదాపు ప్రతి కంపెనీ.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే.. ఎలక్ట్రిక్ బైకులకు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ. అంతే కాకుండా ఇవి పర్యావరణ హితం కూడా. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలాంటి కాలుష్య కారకాలను వాతావరణంలోకి విడుదల చేయవు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లేదా లిథియం అయాన్ పాస్ఫేట్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఎక్కువ మన్నికను ఇస్తాను. సంస్థలు కూడా ఈ బ్యాటరీలపైన మంచి వారంటీ కూడా అందిస్తాయి. విద్యుత్ శక్తిని ఉపయోగించుకోవడం ద్వారా.. శిలాజ ఇంధన వినియోగం మాత్రమే కాకుండా కార్బన్ ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
ఇదీ చదవండి: తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు
పెట్రోల్ బైక్స్
చాలా కాలంగా ఎక్కువమంది పెట్రోల్ బైకులనే ఉపయోగిస్తున్నారు. ఇంధనం అయిపోగానే.. వెంటనే ఫిల్ చేసుకోవడానికి లేదా నింపుకోవడానికి పెట్రోల్ బంకులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ పెట్రోల్ బైకులకు ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది పెట్రోల్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. పనితీరు పరంగా కూడా పెట్రోల్ బైకులు.. ఎలక్ట్రిక్ బైకుల కంటే ఉత్తమంగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ కొనుగోలు చేయకపోవడానికి కారణం
ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైక్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. చాలామంది పెట్రోల్ బైక్స్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని అందుబాటులో లేకపోవడం అనే తెలుస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే.. ఛార్జింగ్ మధ్యలోనే ఖాళీ అవుతుందేమో అనే భయం కూడా ఎక్కువమంది కొనుగోలు చేయకపోవడానికి కారణం అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment