చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్‌లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది.
ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు.
ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్‌ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది.
చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి..
Comments
Please login to add a commentAdd a comment