woman police
-
అమ్మంటే..అమ్మే: పోలీసమ్మ వైరల్ వీడియో
అమ్మ ఎక్కడున్నా అమ్మే. పసిబిడ్డ గుక్క పట్టి ఏడిస్తే ఏ తల్లి మనసైనా తల్లడిల్లి పోదూ! అమ్మ ప్రేమ, మమకారం అలాంటిది మరి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కేరళ కొచ్చిలోని ఈ ఘటన చోటు చేసుకుంది నాలుగు నెలల శిశువు ఏడుపు చూసి చలించిపోయారు కేరళ పోలీసు అధికారి ఎంఏ ఆర్య. క్షణం ఆలోచించకుండా ఆకలితో ఉన్న పాపాయికి తన స్థన్యం ఇచ్చి బిడ్డను అక్కున చేర్చుకున్నారు. నెటిజనుల హృదయాలను గెలుచుకున్నారు. పాట్నాకు చెందిన బిడ్డ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కొచ్చిలోని ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతోంది. బిడ్డ తండ్రి వలస కార్మికుడు ఇక్కడ జైలులో ఉన్నాడు. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలు.అయితే అనారోగ్య సమస్య కారణంగా ఆసుపత్రిలో చేరిన తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారని కంట్రోల్ రూమ్ పోలీసుల సమాచారం అందించారు సిబ్బంది. వారిని చూసుకునే వారు ఎవరూ లేకపోవడంతో, సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని గురువారం కొచ్చి సిటీ మహిళా స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇంతలో తల్లి దూరమైన ఆ చిన్నారి ఆకలితో ఏడుస్తోంది. అది చూసి ఫీడింగ్ మదర్ కూడా అయిన పోలీసమ్మ తన తల్లి మనసు చాటుకున్నారు. ఆ చిన్నారికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని అధికారిని ఒప్పించి శిశువు కడుపు నింపి నిద్రపుచ్చారు. తనకూ తొమ్మిది నెలల పసి బిడ్డ ఉందని బిడ్డ ఆకలి తనకు తెలుసునని చెప్పింది. ఆర్య చేసిన పనిని నగర పోలీసులు ప్రశంసించారు. అలాగే అనారోగ్యంతో ఉన్న మహిళ పిల్లలను చైల్డ్ కేర్ హోమ్‌కు తరలించామని పోలిసులు తెలిపారు. എറണാകുളം ജനറൽ ആശുപത്രിയിൽ ഐസിയുവിൽ അഡ്മിറ്റായ പാട്ന സ്വദേശിയുടെ 4 കുട്ടികളെയാണ് നോക്കാൻ ആരും ഇല്ലാത്തതിനാൽ രാവിലെ കൊച്ചി സിറ്റി വനിതാ സ്റ്റേഷനിൽ എത്തിച്ചത്. അതിൽ 4 മാസം പ്രായമായ കുഞ്ഞിന് ഫീഡിങ് മദർ ആയ ആര്യ മുലപ്പാൽ ഇറ്റിച്ച് വിശപ്പകറ്റി ❤️❤️ കുട്ടികളെ ശിശു ഭവനിലേക്ക് മാറ്റി.. pic.twitter.com/kzcrzq0hh6 — Remya Rudrabhairav (@RMahatej) November 23, 2023 -
మహిళా ఎస్సైతో ప్రేమ.. ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే గదిలోకి వెళ్లి
తమిళనాడు: మహిళా ఎస్ఐతో ప్రేమ వ్యవహారంలో మనస్పర్థలు రావడంతో ఎస్ఐ ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. ధర్మపురి జిల్లా ఆరూర్‌కు చెందిన రాజ్‌కుమార్(27) 2021లో సబ్ ఇన్స్పెక్టర్గా చేరారు. ఏడు నెలలుగా తిరుపత్తూరు జిల్లా వానియంబాడి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఈయన తిరుపత్తూరు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను ప్రేమిస్తున్నాడు. వీరి ప్రేమకు రాజ్‌కుమార్ తల్లిదండ్రులు వ్యతిరేక తెలిపారు. మంగళవారం రాత్రి రాజ్‌కుమార్‌తో పాటు ఇన్స్పెక్టర్ దురైరాజ్, కానిస్టేబుల్ విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో రాజ్‌కుమార్‌కు ప్రియురాలికి ఫోన్ చేశారు. పోలీస్‌స్టేషన్ బయటకు వెళ్లి వీడియో కాల్లో మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన రాజ్‌కుమార్ ఫోన్లో మాట్లాడుతూనే స్టేషన్‌లోపలికి వెళ్లి తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన సహ పోలీసులు తలుపులు తెరిచి ఆయన్ను కిందకు దించారు. డీఎస్పీ విజయకుమార్‌కు సమాచారం అందజేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. -
హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన మహిళా పోలీసులు.. నెటిజన్ల ఫైర్..
ముంబై: ద్విచక్రవాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం మన దేశంలో తప్పనిసరి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. మోటారు వాహన చట్టం సెక్షన్ 129లో ఈ నిబంధన ఉంది. దీంతో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుంది. అయితే ముంబైలో ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ ధరించకుండానే స్కూటీ నడపడం చూసిన ఓ వ్యక్తి వెంటనే ఫొటో తీశాడు. ఓ సాధారణ పౌరుడు ఇలా చేస్తే ఉరుకుంటారా అని అధికారులను ప్రశ్నిస్తూ ఈ ఫొటోను ట్వీట్ చేశాడు. ఏకంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబై పోలీసులను కూడా ట్యాగ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు వీళ్లకు వర్తించవా? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోరా అని ఫైర్ అయ్యాడు. MH01ED0659 What if we travel like this ?? Isn't this a traffic rule violation ?@MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/DcNaCHo7E7 — Rahul Barman (@RahulB__007) April 8, 2023 దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఈ మహిళా పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరేమో.. రూల్స్ ఎప్పుడూ సామాన్యులకే వర్తిస్తాయి, చట్టాలు చేసేవారికి, చట్టపరిరక్షకులకు అవి వర్తించవు అని అసహనం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరగడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. ఆ ఫొటో సరిగ్గా ఎక్కడ తీశారో చెప్పాలని పోస్టు చేసిన వ్యక్తిని అడిగారు. దీంతో అతడు ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే (దాదర్) అని బదులిచ్చాడు. అనంతరం ఈ మహిళా పోలీసులపై చర్యలు తీసుకుంటామని, మాతుంగా ట్రాఫిక్ డివిజన్ పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారే చేశామని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు శాంతించారు.భారత్‌లో హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తారు. ఇదే తప్పును పదే పదే రిపీట్ చేస్తే.. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తారు. అరుదైన సందర్బాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తారు. చదవండి: ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. మైండ్ దొబ్బిందా..? -
23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా ఎస్సై
సాక్షి, చెన్నై: చిరు ఉద్యోగులే బైక్‌లు, కార్లు వినియోగిస్తున్న ఈ రోజుల్లో ఓ పోలీస్ అధికారిణి గత 23 ఏళ్లుగా సైకిల్ పైనే విధులకు హాజరవుతుండడం కచ్చితంగా విశేషమే. వివరాలు.. చెన్నై షావుకారుపేటలోని ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల జి.పుష్పరాణి రోజూ సైకిల్ పైనే డ్యూటీకి వెళ్తారు. అలాగేే తన ఇంటి పనులకు సైతం దాన్నే వాడుతారు. 1997లో ఈమె తమిళనాడు స్పెషల్ పోలీసు విభాగంలో గ్రేడ్– 1 కానిస్టేబుల్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత పదోన్నతి ద్వారా పుదుపేట ఆర్మ్డ్ రిజర్వుకు బదిలీ అయ్యారు. విశ్రాంత ఎస్ఐ అయిన తన తండ్రి గోవింద స్వామి సైకిల్ పైనే విధులకు వేళ్లేవారని ఆమె పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తితో దాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏడో సైకిల్ చెన్నై సిటీ పోలీసు కమిషనర్ శంకర్ జివాల్ బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. ఎవరినీ సైకిల్ తొక్కమని బలవంతం చేయనని, అలాగే తనను సైకిల్ నుంచి ఎవరూ దూరం చేయలేరని పుష్పరాణి స్పష్టం చేశారు. తన ఇద్దరు పిల్లలను మాత్రం ఆరోగ్య సంరక్షణ కోసం సైకిల్ పైనే పాఠశాలకు వేళ్లేలా ప్రేరేపిస్తున్నట్లు చెప్పారు. ధనవంతులకు సైకిల్ వ్యాయామం అయితే.. పేదలకు అది జీవనాధారం అని ఆమె తెలిపారు. ఫ్లవర్ బజార్ పోలీసు స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి. ఇంద్ర మాట్లాడుతూ సబ్ ఇన్స్పెక్టర్ పుష్పారాణి ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారని కొనియాడారు. -
Viral Video: గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన మహిళా పోలీస్
భోపాల్: రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు. మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. ग्वालियर: "राहगीर को आया हार्ट अटैक, लेडी पुलिस ने CPR दे बचाई जान।" लोग ट्रैफिक सूबेदार सोनम पराशर की कर रहे जमकर तारीफ।#gwalior #CPR #heartattack pic.twitter.com/qhrrSF2mwh — The Hint News (@TheHintNews) December 13, 2022 అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు -
వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ
చెన్నై: మోస పోయిన వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. తప్పు చేసిన వారిని శిక్షించి సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత వాళ్లది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఓ ఉన్నత అధికారి నీచానికి దిగజారారు. తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్‌లో పంపి రాక్షస ఆనందం పొందాడు. చివరికి తను తీసుకున్న గోతిలో తానే పడినట్లు డీఎస్పీ కామ క్రీడల వ్యవహారం అతన్ని చిక్కుల్లో పడేసింది. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డీఎస్పీగా(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. కాసేపటి తరువాత ఆ ఫోటోలు డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అవి నెట్టింట్లో లీక్ అయ్యాయి. దీంతో అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా పోలీసులు పారా వాసుదేవన్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీస్ అధికారులు డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులకు రాసిన లేఖలో.. తమ అనుమతి లేకుండా మహిళా పోలీసులను అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు ఆరోపించారు. ఇప్పటికే డీఎస్పీపై మే 23, సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినప్పటికీ డీఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్‌ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. చదవండి: సాయం కోరిన స్నేహితుడి ప్రేయసిపై కన్నేసిన యువకుడు.. ఇద్దరిని ఇంటికి పిలిపించి.. -
కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో.. పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో..
‘భార్యాపిల్లలకు దూరంగా ఉండలేకపోతున్నా.. స్పౌజ్ ట్రాన్స్ఫర్ కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నా.. కానీ, ఎంతకూ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఇక ఎదురుచూసే ఓపిక నాకు లేదు. అందుకే, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అంటూ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో సందేశం పెట్టాడు ఓ కానిస్టేబుల్. తన భర్త కూడా తనలాగే కానిస్టేబుల్ అని, తన మూడేళ్ల కుమారుడిని చూసుకునే వారెవరూ లేరని బందోబస్తుకు పిల్లాడిని చంకనెత్తుకు వెళ్లాల్సి వస్తోందని, దయచేసి తమ స్పౌజ్ దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని విలపిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో సోషల్‌మీడియాతోపాటు, డిపార్ట్మెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, కరీంనగర్: ‘కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో.. పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో’.. అంటూ లేత మనసులు సినిమాలో హృదయాన్ని కరిగించే పాట ఉంది. ఇప్పుడు పోలీసు దంపతుల పిల్లల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. తల్లి జిల్లా కేంద్రంలో సివిల్ (లా అండర్ ఆర్డర్), తండ్రి గ్రేహౌండ్స్ ఎక్కడో చత్తీస్ఘడ్ సరిహద్దులో విధులు నిర్వహించాలి. పిల్లలు కాస్త పెద్దవారైతే హాస్టల్లో ఉంటున్నారు. ఇపుడు ఎటొచ్చీ.. ఏడెనిమిదేళ్లలోపు పిల్లలు కావడంతో పోలీసు దంపతులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఉరుకులు పరుగుల జీవితాలు.. కుటుంబానికి, చివరికీ చిన్నపిల్లలకు సైతం దూరంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మగవారికి కాస్త ఫర్వాలేదు కానీ, పాలిచ్చే తల్లులు, తమ పని తాము చేసుకోని పిల్లలున్న మహిళా పోలీసుల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 30 జంటలు.. పోలీసు కొలువంటేనే విరామం లేని విధి. అందుకే, ఈ డిపార్ట్మెంటు సిబ్బంది ఒకే డిపార్ట్మెంటు వ్యక్తులను వివాహం చేసుకోవడం చాలా అరుదు. ఇద్దరి స్వప్నం పోలీసుశాఖే అయిన అరుదైన జంటలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. 317 జీవో అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నెలలో దాదాపు 350 స్పౌజ్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు 45కిపైగా పరిష్కారమయ్యాయి. కానీ, 300లకుపైగా దరఖాస్తులకు ఇంతవరకూ మోక్షం లభించలేదు. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 30కిపైగా దరఖాస్తులు ఉన్నాయి. అందులోనూ రామగుండం కమిషనరేట్ (సుమారు 10), కరీంనగర్ కమిషరేట్ (11), జగిత్యాల (5), సిరిసిల్ల (4) వరకు దరఖాస్తులు అలాగే ఉన్నాయి. జేఎస్పీ, బ్యాంకు, కేంద్ర ఉద్యోగులకు నో చాన్స్! ఈ క్రమంలో డిపార్ట్మెంటులో కొన్ని రకాల దరఖాస్తులపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారంతో నీలినీడలు కమ్ముకున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ, బ్యాంకు సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే వారి దరఖాస్తులు పరిశీలించడం లేదన్న ప్రచారం ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అదే సమయంలో కరీంనగర్, రామగుండం, ఖమ్మం కమిషరేట్లను బ్లాక్‌లిస్టులో పెట్టారని, ఈ జిల్లాల దరఖాస్తులను ఇక పరిష్కరించరని జరుగుతున్న ప్రచారం వీరి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. ఇక పోలీసు దంపతుల విషయానికి వస్తే.. వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భార్య, భర్తలు చెరొక జిల్లాలో ఉండటం, 24 గంటల విధులు నిర్వహించాల్సి రావడంతో చంటిపిల్లలను చూసుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి పోలీసుకావాలని కలలుగని సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోలేక, చిన్నారులను డేకేర్ సెంటర్లలో వదిలి రాలేక ఆ తల్లులంతా తల్లడిల్లుతున్నారు. మరోవైపు ఎక్కడో విధులు నిర్వహిస్తు్తన్న తండ్రులు, భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో అని కలత చెందుతున్నారు. త్వరలోనే పరిష్కారం పోలీసుదంపతులు ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. స్పౌజ్ దరఖాస్తుల విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. త్వరలోనే సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. – గోపీరెడ్డి, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు -
మహిళా పోలీసుకు డిప్యూటీ తహసీల్దార్ లైంగిక వేధింపులు
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): ఊటీలో మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఊటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబు (35) డిప్యూటీ తహసీల్దారుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా ఓ మహిళా పోలీసు సహా ఇద్దరు పోలీసులను కేటాయించారు. మగ కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేయమని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళా పోలీసును డిప్యూటీ తహసీల్దారు లైంగిక వేధించినట్లు తెలిసింది. ఆమె దీనిని ఖండించారు. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో బాధితురాలు ఊటీలో ని మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు డిప్యూటీ తహసీల్దారును అరెస్టు చేశారు. చదవండిః ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు -
మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం
సాక్షి, తాడేపల్లి: మహిళా పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విడుదల చేసింది. ఏపీ మహిళా పోలీస్ సబార్డినేట్ రూల్స్ 2021కి ఆమోదం తెలిపింది. మహిళా పోలీసులను ఐదు కేటగిరీలుగా విభజించారు. ప్రారంభంలో మహిళా పోలీసులుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీనియర్ మహిళా పోలీస్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయి వరకూ ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
పురుషుడిగా మారేందుకు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళా కానిస్టేబుల్‌కు తీపి కబురు అందించింది. మహిళ విన్నపం మేరకు.. లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఆమెకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స జరుగుతుందని తెలిపారు. ఆమెకు.. చిన్న తనం నుంచి పురుషులలో ఉన్నట్లు కొన్ని లక్షణాలు, హర్మోన్లు ఉన్నట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆమె.. 2019లో లింగమార్పిడి శస్త్ర చికిత్సకోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, గ్వాలియర్, ఢిల్లీలోని వైద్యుల సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కానిస్టేబుల్ తెలిపారు. దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు.‘లింగమార్పిడి అనేది వ్యక్తి హక్కు..’ అని అన్నారు. అందుకే మహిళా కానిస్టేబుల్‌కు అనుమతి తెలుపుతూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్జరీకి ఆమె కుటుంబంవారు అంగీకరించలేదని తెలుస్తోంది. కానీ.. మహిళా లింగ మార్పిడి చేసుకోవడానికి మొగ్గుచూపుతుంది. దీనికోసం తాను.. దాచుకున్న డబ్బులతో సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు కానిస్టెబుల్ తెలిపారు. కాగా, 2018లో మహరాష్ట్రకు చెందిన లలితా సాల్వె అనే మహిళా కానిస్టేబుల్ కూడా ఇదేవిధంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు సెయింట్ జార్జ్ ఆస్పత్రి వైద్యులు లింగమార్పిడి చికిత్సను నిర్వహించారు. -
సచివాలయం మహిళా పోలీస్ ఆత్మహత్య!?
సాక్షి, చీరాల: చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయం మహిళా పోలీసు ముత్యాల భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తమ కుమార్తెను అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన గురువారం చీరాల సాల్మన్ సెంటర్లో వెలుగు చూసింది. చీరాల ఒన్‌టౌన్ సీఐ రాజమోహన్ కథనం ప్రకారం.. పట్టణంలోని 16వ వార్డు సచివాలయంలో ముత్యాల భార్గవి మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఆమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం రాత్రి ఏం జరిగిందో ఏమోగానీ ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసి మృతురాలి భర్త రాంబాబును విచారణ చేస్తున్నామని, విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని, ఈ మేరకు భార్గవి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తమ కుమార్తె భార్గవిని అల్లుడు రాంబాబు మద్యం తాగి తరుచూ వేధింపులకు గురిచేస్తుండేవాడని, ఈ విషయం పలుమార్లు తమకు చెప్పుకుని బాధపడిందని, కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కన్న తల్లి విగత జీవిగా పడి ఉండటంతో పిల్లలు భోరున విలపిస్తున్నారు. సాల్మన్ సెంటర్‌తో పాటు మృతురాలు పనిచేసే సచివాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్: అనుష్క
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పాహి’ మొదటి వార్షికోత్సవం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. షీ పాహి కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళా సిబ్బందిలో స్పూర్తి నింపుతున్నామన్నారు. సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలు ఉన్నారని, మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వుమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ట్రాఫిక్‌లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. చదవండి: శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్‌కు.. ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ లాంటి వారని హీరోయిన్ అనుష్క శెట్టి అన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని, తనను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది మహిళా పోలీస్‌లు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. షీ పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు లేకుండా జీవితాన్ని ఊహించలేమంటూ కొనియాడారు. వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలతో సత్కరించారు. పోలీసులతో అనుష్క ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2014లె షీ టీమ్స్‌ను మొదలు పెట్టామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. విధుల్లో స్త్రీ, పురుషులని ఎలాంటి వివక్ష ఉండదని, షీ టీమ్స్‌లో పురుషులుకూడా ఉన్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. భరోసా సెంటర్లు రాష్ట్రంలో 4 ఉన్నాయని, 2021లో భరోసా సెంటర్స్ సంఖ్య 10కి పెంచుతామని తెలిపారు. సైబరాబార్లో ఒకేసారి 2058 కెమెరాలు పెట్టారని పేర్కొన్నారు. -
మహిళా పోలీస్‌పై ఇన్స్పెక్టర్ అత్యాచారం
లక్నో : మహిళా పోలీస్‌పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెండయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన రాకేశ్ యాదవ్.. క్రైం బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత అక్టోబర్ 29న ఓ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను తను ఉన్న హోటల్ గదికి తీసుకురావల్సిందిగా ఓ మహిళా పోలీస్‌ను ఆదేశించాడు. హోటల్ గదికి వెళ్లిన ఆమెపై అత్యాచారం చేశాడు. (పిల్లల కళ్ల ముందే సెల్ఫీ వీడియో తీసుకొని..) ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. అయితే దాన్ని అలసుగా తీసుకున్న రాకేశ్ తరుచుగా ఆమెకు ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆమె జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఇన్స్పెక్టర్ కోసం గాలిస్తున్నారు. -
ట్రైనింగ్ క్లాస్
పోలిస్ ట్రైనింగ్‌లో చాలా విషయాలు తెలుస్తాయి. మొదట దొంగ ముఖాలేవో తెలుస్తుంది. అనుమానించడం, ఒక కన్నేసి ఉంచడం, వెంబడించడం, పట్టుకోవడం, పారిపోతుంటే దొరికించుకోవడం, మళ్లీ పారిపోతాడనుకుంటే బేడీలు వెయ్యడం వరకు అన్నీ నేర్చుకోవలసినవే. నేర్చుకోవడంలో తేడా వస్తే దొంగ పంట పండినట్లే! నేర్చుకోవడంలోనే కాదు.. నేర్పించడంలో తేడా వచ్చినా ఒక్కోసారి పోలీసే దొంగకు లోకువ అవుతాడు. యూకెలోని నార్థంటైన్షైర్ పోలీస్‌శాఖలో స్కాట్ రెన్విక్ ముఖ్య శిక్షణాధికారి. కోర్ సార్జెంట్. ‘సార్జెంట్’ అనే మిడిల్ ర్యాంకు ఆర్మీలో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉంటుంది. మళ్లీ పోలిస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. నేవీలో ఉండదు. ఉంటుంది కానీ పేరు వేరు. ‘మెరైన్ కార్పొరల్’ అంటారు పరీక్ష రాసి, పాస్ అయ్యి, ఇంటర్వూ్యలో సెలక్ట్ అయి పోలిస్ ఉద్యోగంలోకి వచ్చిన పిల్లలకు (ట్రైనీలు) ఈ ర్యాంకులలోని పెద్దంతరాలు, చిన్నంతరాలు చెప్పడం అయ్యాక ‘దొంగాపోలిస్’ ప్రాక్టికల్స్ ప్రారంభం అవుతాయి. అయితే ప్రారంభం అయిన తొలిరోజే మన సార్జెంట్ పోలిస్.. దొంగగారు అయిపోయారు. దొంగకు బేడీలు ఎలా వేయాలో ట్రైనీలకు చెబుతూ తనే తన చేతులకు బేడీలను లాక్ చేసేసుకున్నారు. వాటిని తెరవడం పెద్ద పనయ్యింది. ఫైర్ ఫైటర్ టూల్‌తో కత్తిరించారు. అంతా అయ్యాక.. ‘‘నేను కూడా నవ్వి ఉండాల్సింది’’ అని సార్జెంట్గారు అన్నారు. అంటే శిక్షణలో ఉన్న ‘నాలుగో సింహాలు’ ఆయన్ని చూసి నవ్వాయనే కదా. అయినా.. కీ తో పోయేదానికి కట్టర్ దాకా ఎందుకు వెళ్లినట్లు? అవి హింజ్డ్ హ్యాండ్ కఫ్స్. ఒక పొజిషన్లో పడిపోతే తాళం దూరడం కూడా కష్టమే! -
అనధికార మద్యాన్ని పట్టించిన మహిళా పోలీసు
తూర్పుగోదావరి, మామిడికుదురు: సముద్ర తీరంలోని కరవాక గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వారి ఆట కట్టించారు సచివాలయ మహిళా పోలీసు. సహచర సచివాలయ ఉద్యోగులతో కలిసి ఆమె మద్యం విక్రయిస్తున్న రేకాడి వెంకటసూర్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఇంటి పంచన సంచిలో రహస్యంగా దాచి ఉంచిన మద్యం సీసాలను ధన్యశ్రీ స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుంటున్న ధన్యశ్రీని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు అడ్డుకున్నప్పటికీ వారిని లెక్క చేయకుండా 22 మద్యం బాటిళ్లతో ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని గ్రామ పంచాయతీకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో సహచర సచివాలయ ఉద్యోగులు మహిళా పోలీసుకు అండగా నిలిచారు. అనంతరం సమాచారాన్ని నగరం పోలీసుకు అందించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను నగరం పోలీసులకు స్వాధీనం చేశామని పంచాయతీ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎంతో తెగువ చూపిన మహిళా పోలీసుతో పాటు సచివాలయ ఉద్యోగులను స్థానికులు అభినందించారు. -
సాధించిన పోలీసు నదియా
కర్ణాటక,కెలమంగలం: ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ఆత్మహత్యాయత్నం చేసిన మహిళా పోలీసు కథ సుఖాంతమైంది. కోరుకున్న ప్రియునితోనే ఆమె పెళ్లి జరిగింది. అంచెట్టి తాలూకా పాండురంగన్దొడ్డి గ్రామానికి చెందిన పాండురంగన్ కూతురు నదియా (26) తిరుప్పూర్ సాయుధ విభాగంలో పోలీసుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన కణ్ణన్ (28) క్రిష్ణగిరిలో పోలీసుగా పనిచేస్తున్నాడు. ఇరువురూ గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకొంటున్నారు. ఈ తరుణంలో పెళ్లి చేసుకుందామని నదియా కోరగా కణ్ణన్ నిరాకరించాడు. దీంతో జీవితం మీద విరక్తి చెందిన నదియా సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో డెంకణీకోట డీఎస్పీ సంగీత, అంచెట్టి పోలీసులు ఇరు కుటుంబాలతో చర్చించి పెళ్లికి ఒప్పించారు. వీరి పెళ్లి బుధవారం డెంకణీకోట సమీపంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా జరిగింది. అనంతరం డెంకణీకోట సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి నమోదు చేయించుకున్నారు. -
పురుడు పోసిన మహిళా పోలీసులు
సాక్షి, చెన్నై : నెల్లై రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి మహిళా పోలీసులు పురుడు పోశారు. దీంతో ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తూత్తుకుడి జిల్లా తిరువైకుంఠం తెప్పకులం వీధికి చెందిన సుడలై భార్య మారియమ్మాల్ (28) నిండు గర్భిణి. ఆమె గురువారం తన రెండు సంవత్సరాల చిన్నారి కొప్పురందేవిని వెంటబెట్టుకుని కడయంలోని తన పుట్టింటికి రైల్లో బయలుదేరింది. కడయంకు వెళ్లుటకు శుక్రవారం సాయంత్రం నెల్లై రైల్వేస్టేషనల్లో ఆమె రైలు ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో ఆమెకు హఠాత్తుగా ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో రైల్లో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఆమెను భద్రంగా ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చారు. ఆమె వెంట రెండు సంవత్సరాల చిన్నారి వుండటంతో ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చిన ఎస్ఐ జూలియట్, మహిళా పోలీసులు రాధ, విజయలక్ష్మి మారియమ్మాళ్‌ను ప్లాట్‌ఫారంపై సురక్షిత ప్రదేశానికి తీసుకొచ్చి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కాని అంబులెన్స్ రావడానికి ఆలస్యం కావడం, ప్రసవ నొప్పులు ఎక్కువ కావడం, మారియమ్మాల్ నొప్పితో బాధపడుతుండటంతో మహిళా పోలీసులే ఆమెకు పురుడు పోశారు. దీంతో మారియమ్మాల్ ముచ్చటైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత తల్లి, బిడ్డను 108 అంబులెన్స్‌లో నెల్లై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్బంగా చొరవ చూపిన మహిళా పోలీసులపై ఉన్నతాధికారులు, ప్రయాణికులు ప్రశంసల వర్షం కురిపించారు. -
రాష్ట్రంలో మహిళ, గిరిజన పోలీస్ బెటాలియన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మహిళ, గిరిజన పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోని తన చాంబర్లో ఆదివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్స్ మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు ఏర్పాటు చేసే అవకాశం వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం మొదటగా మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. దళిత మహిళనైన తనకు కీలక బాధ్యత గల హోం మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రూపొందిస్తాం రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి విధి నిర్వహణలో ప్రజల మన్ననలు పొందేలా చేస్తామన్నారు. మహిళలు గానీ, ఇతర బాధితులు గానీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని వివరించారు. పోలీసులు కూడా వారానికి ఒక రోజు తమ కుటుంబాలతో ఆనందంగా గడపడానికి వీక్లీఆఫ్‌ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామన్నారు. 2018 పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన ఫలితాలు త్వరలో ప్రకటిస్తామని, ఇతర ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. చాంబర్లో ప్రత్యేక పూజలు.. తొలుత మంత్రి సుచరిత, ఆమె భర్త దయాసాగర్‌తో కలసి చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద మంత్రాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రికి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గజరావు భూపాల్, ఇతర అధికారులు, నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఫోన్‌కాల్ ఫిర్యాదుతో పాస్టర్ అరెస్టు తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒక బాధితురాలి తల్లి అనంతపురం నుంచి ఫోన్ చేసి నాలుగు నెలల కిందట జరిగిన ఒక సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు మంత్రి సుచరిత వివరించారు. ఓ చిన్నారి పట్ల ఫాస్టర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె తెలిపిందన్నారు. ఆ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి ఫాస్టర్ పారిపోయారని, అయితే ఓ వర్గం మీడియా మాత్రం.. ‘‘వెంటనే చర్యలు తీసుకోలేకపోయారు. అసమర్థులు’’ అన్నట్లు రాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత రెండు రోజులకు ఆ పాస్టర్ని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని మంత్రి తెలిపారు. ఫిర్యాదు అందిన తరువాత చర్యలు తీసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని, తొందరపడి వార్తలు రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
మహిళా పోలీసు ఆత్మహత్య
సేలం: భర్త విడాకుల నోటీసు పంపాడని మహిళా పోలీసు ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సేలం బోడినాయకన్‌పట్టి గ్రామానికి చెందిన మహిళ భువనేశ్వరి (33). ఈమె జలగండాపురం పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. 2014లో గౌతమన్ను వివా హం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజు లుగా కుటుంబ సమస్యలతో భువనేశ్వరి భర్తను వదిలి అన్నానగర్‌లోని తండ్రి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో గౌతమన్ విడాకులు కోరుతూ నోటీసు పంపించాడు. విషయం తెలుసుకున్న భువనేశ్వరి ఆదివారం భర్త ఇంటికి వెళ్లి కలిసి జీవిద్దామని కోరింది. వారు భువనేశ్వరిని అవమానించి, ఇంటి నుంచి బయటకు గెంటివేశారని సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన భువనేశ్వరి ఆదివారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న భువనేశ్వరిని చూసి కుటుంబీకులు బోరున విలపించారు. సమాచారంతో సూరమంగలం పోలీసులు భూవనేశ్వరి మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలిం చా రు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
మహిళా ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం
టీ.నగర్: నాగపట్నం ఎస్పీ కార్యాలయంలో మహిళా ఇన్స్పెక్టర్ శనివారం రాత్రి ఆత్మహత్యాకు యత్నించింది. నాగపట్నం మైలాడుదురై ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్గా సుగుణ (36) పనిచేస్తూ వచ్చారు. ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో ఈమెను ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్ సాయుధ దళానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి విధుల్లో చేరింది. అక్కడ కూడా అధికారులు టార్చర్ చేసినట్లు సమాచారం. దీంతో విరక్తి చెందిన సుగుణ శనివారం రాత్రి ఎస్పీ కార్యాలయం పోర్టికోలో నిలుచుని అధిక మొత్తంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నిం చింది. అక్కడున్న పోలీసులకు తాను నిద్రమాత్రలు మింగినట్లు తెలపడంతో వారు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఇన్స్పెక్టర్ సుగుణ భర్త పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో పనిభారం, అధికారుల వేధింపులు అధికం కావడంతో ఈ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. -
హైదరాబాద్‌లో పోకిరీలకు ఇక ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోకిరీలకు బ్యాడ్ టైమ్ మొదలైపోయింది. ఇంతకాలం పోలీస్ పెట్రోలింగ్ మగ పోలీసులే నిర్వహించటం చూస్తున్నాం. ఇందుకోసం ఇప్పుడు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దించేసింది తెలంగాణ పోలీస్ శాఖ. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, అత్యాచార యత్నం వంటి ఘటనల్ని నివారించేందుకు ఈ మహిళా పోలీస్ పెట్రోలింగ్‌ను వినియోగించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారిగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పెట్రో కారులోనే ఇక మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తారు. వారికి సహాయకంగా కొందరు సిబ్బంది(మగ) కూడా ఉంటారు. రోడ్లపై ఆకతాయిలు, తాగుబోతుల వీరంగం... ఇలా ఏది కనిపించినా రంగంలోకి దిగి తాట తీస్తారు. దేశంలో మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో ఆ స్టేషన్ల గడప తొక్కేవారు అరుదు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడో, బస్టాప్ లో నిల్చున్నప్పుడో, స్కూలుకు వెళుతున్నప్పుడో.. పోకిరీలు పిచ్చి చేష్టలు చేస్తే... పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి అమ్మాయిలు కాస్త తటపటాయిస్తుంటారు. అదే మహిళా పోలీసులు అయితే గనుక నిరభ్యరంతంగా వెళ్లి చెప్పేయొచ్చు. వాళ్లు తమ ఎదుట ఉన్నారన్న భరోసా మహిళల్లో మరికాస్త ధైర్యాన్ని ఇస్తుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచదేశాలన్నీ మహిళా పోలీసు వ్యవవస్థను పటిష్టపరుస్తున్నాయి. ఇప్పటికే ఇటలీ, చైనా వంటి దేశాలు ఈ దిశగా అడుగులువేసి మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాయి. ఇక తొలిసారి ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా నిర్ణయంతో మరో అడుగు ఇప్పుడు ముందుకు వేసినట్లయ్యింది. కాగా, రాజస్థాన్ దేశంలోనే తొలి మహిళా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని నియమించగా.. ఢిల్లీ కూడా ఆ జాబితాలో నిలిచింది. -
యాక్సిడెంట్ బాధితులకు 35 లక్షల పరిహారం
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి ట్రక్ యజమాని, బీమా సంస్థ సంయుక్తంగా 35 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని థానె మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సూచించింది. ట్రక్ యజమాని మొహమ్మద్ నజీర్ ఖాన్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ థానె కార్యాలయం కలసి ఆ డబ్బును చెల్లించాలని జడ్జ్ కె.డి. వదానె ఆదేశించారు. 2012 యాక్సిడెంట్ కేసులో తల్లిని కోల్పోయిన మహిర్ తౌఫీక్, తౌఫీక్ బాబు తాంబేలకు ఈ పరిహారం అందజేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన సమయంలో మూడేళ్ల వయసున్న కొడుకు.. బాధితుడు మహిర్కు పరిహారంలోని 25 లక్షల రూపాయలను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రమాదం జరిగిన సమయంలో (జనవరి 3, 2012) నైగోన్ నుంచి నెహ్రూనగర్ కు ద్విచక్రవాహనంపై వెడుతున్న 30 ఏళ్ల సజియా తౌఫిక్ తాంబె అలియాస్ నళిని గైక్వాడ్ సియోన్ జంక్షన్ సమీపంలో ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఆమె.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని, రూ. 40 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అప్పట్లో బాధితురాలి తరపున కేసు దాఖలు చేశారు. తమ వాదనలకు మద్దతుగా బాధితురాలి తరపు న్యాయవాది అందుకు కావలసిన పత్రాలను కూడా సమర్పించారు. కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం హక్కుదారుడు, ప్రత్యర్థుల వాదనలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు వెలువరించింది. అప్పట్లో వేగంగా వస్తున్న ట్రక్ ముందు వెళ్తున్న హ్యుందయ్ కారు ఉన్నట్లుండి యూ టర్న్ తిప్పడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యర్థులు సమర్పించిన పత్రాల ఆధారంగా తెలుస్తోంది. దీంతో అటు హ్యుందయ్ కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఇటు ట్రక్ డ్రైవర్ అతి వేగంపై విచారించిన కోర్టు ఘటనకు బాధ్యులైన సంబంధిత బీమా సంస్థ, ట్రక్ డ్రైవర్లు సంయుక్తంగా పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది.