
భువనేశ్వరి, గౌతమన్ (ఫైల్)
సేలం: భర్త విడాకుల నోటీసు పంపాడని మహిళా పోలీసు ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. సేలం బోడినాయకన్‌పట్టి గ్రామానికి చెందిన మహిళ భువనేశ్వరి (33). ఈమె జలగండాపురం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. 2014లో గౌతమన్‌ను వివా హం చేసుకుంది. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజు లుగా కుటుంబ సమస్యలతో భువనేశ్వరి భర్తను వదిలి అన్నానగర్‌లోని తండ్రి ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో గౌతమన్ విడాకులు కోరుతూ నోటీసు పంపించాడు. విషయం తెలుసుకున్న భువనేశ్వరి ఆదివారం భర్త ఇంటికి వెళ్లి కలిసి జీవిద్దామని కోరింది. వారు భువనేశ్వరిని అవమానించి, ఇంటి నుంచి బయటకు గెంటివేశారని సమాచారం. ఇంటికి తిరిగి వచ్చిన భువనేశ్వరి ఆదివారం అర్ధరాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్న భువనేశ్వరిని చూసి కుటుంబీకులు బోరున విలపించారు. సమాచారంతో సూరమంగలం పోలీసులు భూవనేశ్వరి మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలిం చా రు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment