భోపాల్: రోడ్డుపై గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళా ఎస్‌ఐ. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా పోలీస్ సమయస్ఫూర్తిని నెటిజన్లు కొనియాడుతున్నారు.
మహిళా ఎస్ఐ పేరు సోనం పరషార్. రొటీన్ చెకింగ్‌లో భాగంగా రోడ్డుపై విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్‌గా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతని వద్దకు వెళ్లిన సోనం.. అంబులెన్స్‌కు ఫోన్ చేసింది. అయితే అతడు తీవ్రంగా ఇబ్బందిపడటం చూసి సీపీఆర్ చేసింది. ఈలోగా అంబులెన్స్ వచ్చింది. హుటాహుటిన అతడ్ని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ग्वालियर: "राहगीर को आया हार्ट अटैक, लेडी पुलिस ने CPR दे बचाई जान।"
— The Hint News (@TheHintNews) December 13, 2022
लोग ट्रैफिक सूबेदार सोनम पराशर की कर रहे जमकर तारीफ।#gwalior #CPR #heartattack pic.twitter.com/qhrrSF2mwh
అయితే సదరు వ్యక్తికి సరైన సమయంలో సీపీఆర్ చేసి ఉండకపోతే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం అయ్యేదని వైద్యులు తెలిపారు. అతని పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు.
చదవండి: శ్రద్ధ వాకర్ తరహా ఘటన..తండ్రిని చంపి 32 ముక్కలు చేసిన కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment