బ్రిటన్ పొలిస్
పోలిస్ ట్రైనింగ్‌లో చాలా విషయాలు తెలుస్తాయి. మొదట దొంగ ముఖాలేవో తెలుస్తుంది. అనుమానించడం, ఒక కన్నేసి ఉంచడం, వెంబడించడం, పట్టుకోవడం, పారిపోతుంటే దొరికించుకోవడం, మళ్లీ పారిపోతాడనుకుంటే బేడీలు వెయ్యడం వరకు అన్నీ నేర్చుకోవలసినవే. నేర్చుకోవడంలో తేడా వస్తే దొంగ పంట పండినట్లే! నేర్చుకోవడంలోనే కాదు.. నేర్పించడంలో తేడా వచ్చినా ఒక్కోసారి పోలీసే దొంగకు లోకువ అవుతాడు. యూకెలోని నార్థంటైన్‌షైర్ పోలీస్‌శాఖలో స్కాట్ రెన్విక్ ముఖ్య శిక్షణాధికారి. కోర్ సార్జెంట్. ‘సార్జెంట్’ అనే మిడిల్ ర్యాంకు ఆర్మీలో ఉంటుంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉంటుంది. మళ్లీ పోలిస్ డిపార్ట్మెంట్‌లో ఉంటుంది. నేవీలో ఉండదు. ఉంటుంది కానీ పేరు వేరు. ‘మెరైన్ కార్పొరల్’ అంటారు
పరీక్ష రాసి, పాస్ అయ్యి, ఇంటర్వూ్యలో సెలక్ట్ అయి పోలిస్ ఉద్యోగంలోకి వచ్చిన పిల్లలకు (ట్రైనీలు) ఈ ర్యాంకులలోని పెద్దంతరాలు, చిన్నంతరాలు చెప్పడం అయ్యాక ‘దొంగాపోలిస్’ ప్రాక్టికల్స్ ప్రారంభం అవుతాయి. అయితే ప్రారంభం అయిన తొలిరోజే మన సార్జెంట్ పోలిస్.. దొంగగారు అయిపోయారు. దొంగకు బేడీలు ఎలా వేయాలో ట్రైనీలకు చెబుతూ తనే తన చేతులకు బేడీలను లాక్ చేసేసుకున్నారు. వాటిని తెరవడం పెద్ద పనయ్యింది. ఫైర్ ఫైటర్ టూల్‌తో కత్తిరించారు. అంతా అయ్యాక.. ‘‘నేను కూడా నవ్వి ఉండాల్సింది’’ అని సార్జెంట్‌గారు అన్నారు. అంటే శిక్షణలో ఉన్న ‘నాలుగో సింహాలు’ ఆయన్ని చూసి నవ్వాయనే కదా. అయినా.. కీ తో పోయేదానికి కట్టర్ దాకా ఎందుకు వెళ్లినట్లు? అవి హింజ్డ్ హ్యాండ్ కఫ్స్. ఒక పొజిషన్‌లో పడిపోతే తాళం దూరడం కూడా కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment