సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్‌లో మహిళా సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 750 మంది మహిళా పోలీసులున్నారన్నారు. నగరంలో బుధవారం ‘షీ పాహి’ మొదటి వార్షికోత్సవం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. షీ పాహి కార్యక్రమం ఏర్పాటు ద్వారా మహిళా సిబ్బందిలో స్పూర్తి నింపుతున్నామన్నారు. సీనియర్ అధికారుల్లో కూడా 50 శాతం మహిళలు ఉన్నారని, మహిళా సిబ్బందికి కేసుల దర్యాప్తులో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. వుమెన్ సిబ్బంది ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో డ్రైవింగ్‌పై శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ట్రాఫిక్‌లో సైతం మహిళా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. చదవండి: శభాష్ పోలీస్.. నిముషాల్లో స్పాట్‌కు..
ఇక్కడ ఉన్న ప్రతి మహిళా పోలీస్ సిబ్బంది ఒక స్టార్ లాంటి వారని హీరోయిన్ అనుష్క శెట్టి అన్నారు. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పని చేశారని, తనను ఇలాంటి కార్యక్రమానికి పిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత మంది మహిళా పోలీస్‌లు ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని పేర్కొన్నారు. షీ పాహి అనే పేరు పెట్టడం చాలా బాగుందన్నారు. సమాజంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీసులు లేకుండా జీవితాన్ని ఊహించలేమంటూ కొనియాడారు. వివిధ పోలీస్ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
పోలీసులతో అనుష్క ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2014లె షీ టీమ్స్‌ను మొదలు పెట్టామని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు. విధుల్లో స్త్రీ, పురుషులని ఎలాంటి వివక్ష ఉండదని, షీ టీమ్స్‌లో పురుషులుకూడా ఉన్నారని తెలిపారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. భరోసా సెంటర్‌లు రాష్ట్రంలో 4 ఉన్నాయని, 2021లో భరోసా సెంటర్స్ సంఖ్య 10కి పెంచుతామని తెలిపారు. సైబరాబార్‌లో ఒకేసారి 2058 కెమెరాలు పెట్టారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment