
సాక్షి, హైదరాబాద్ : వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. అరెస్టయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. నిందితుడు ఆర్టీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ వెహిల్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రమేష్‌తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికిల్ ఇన్సూరెన్స్ పాలసీ లెటర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామన్నారు. చదవండి: తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే..
Comments
Please login to add a commentAdd a comment