'భయపడలేదు.. షాక్ తిన్నా' | I wasn't scared but arrest incident shocked me: Kiku Sharda | Sakshi
Sakshi News home page

'భయపడలేదు.. షాక్ తిన్నా'

Published Tue, Jan 19 2016 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

'భయపడలేదు.. షాక్ తిన్నా'

'భయపడలేదు.. షాక్ తిన్నా'

ముంబై: తనను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదని.. షాక్ కు గురయ్యానని టీవీ నటుడు, కమెడియన్ కికు శార్దా తెలిపాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కామెడీ షోతో పాపులరైన కికు... డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్‌ రామ్ రహీం సింగ్‌ను అనుకరించినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.

'పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేను ఒంటరిని. దీంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. తర్వాత రోజు ఉదయం ట్విటర్ ద్వారా క్షమాపణ కోరారు. నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే క్షమాపణ చెప్పాను, భయపడి కాదు' అని కికు శార్దా తెలిపాడు. ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతోనే అలా చేశానని, ఎవరినీ నొప్పించాలన్న భావన తనకు లేదని స్పష్టం చేశాడు.

హర్యానాలోని పలు పోలీసు స్టేషన్లలో అతడిపై  సెక్షన్ 295ఏ కింద కేసులు నమోదయ్యాయి. కాగా, కికు శార్దాకు సినిమా, టీవీ నటులు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. అతడి తప్పేమీ లేదని వెనుకేసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement