Kiku Sharda
-
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంతో పాపులరయిన కపిల్ శర్మ సినిమా తారలకు దీటుగా సంపాదిస్తున్నాడు. నెలకు దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం అతడి ఖాతాలో పడుతున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కామెడీ నైట్స్ షో సూపర్ హిట్ కావడంతో కపిల్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ సినీ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి షోలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. స్క్రిప్టింగ్ నుంచి ప్రొడక్షన్ వరకు అంతా తానే అయి ఈషోను కపిల్ నడిపిస్తున్నాడు. విభిన్నమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తున్నాడు. అంతేకాదు ఫిట్నెస్ పై కూడా ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నాడు. కపిల్ టీమ్ లోని వారు కూడా భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు సునీల్ గ్రోవర్ రూ.10 నుంచి 12 లక్షలు, కికు షర్దా రూ.5 నుంచి 7 లక్షలు, చందన్ ప్రభాకర్ రూ. 4 లక్షలు, సుమన చక్రవర్తి రూ. 6 నుంచి 7 లక్షలు, రొచెల్లె రావు రూ. 3 నుంచి 4 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎపిసోడ్ కు రూ.8 నుంచి 10 లక్షలు ఇస్తున్నారని తెలిపింది. -
'భయపడలేదు.. షాక్ తిన్నా'
ముంబై: తనను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదని.. షాక్ కు గురయ్యానని టీవీ నటుడు, కమెడియన్ కికు శార్దా తెలిపాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కామెడీ షోతో పాపులరైన కికు... డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రామ్ రహీం సింగ్‌ను అనుకరించినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై విడుదల చేశారు. 'పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేను ఒంటరిని. దీంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యా. తర్వాత రోజు ఉదయం ట్విటర్ ద్వారా క్షమాపణ కోరారు. నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే క్షమాపణ చెప్పాను, భయపడి కాదు' అని కికు శార్దా తెలిపాడు. ప్రేక్షకులను నవ్వించాలన్న ఉద్దేశంతోనే అలా చేశానని, ఎవరినీ నొప్పించాలన్న భావన తనకు లేదని స్పష్టం చేశాడు. హర్యానాలోని పలు పోలీసు స్టేషన్లలో అతడిపై సెక్షన్ 295ఏ కింద కేసులు నమోదయ్యాయి. కాగా, కికు శార్దాకు సినిమా, టీవీ నటులు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. అతడి తప్పేమీ లేదని వెనుకేసుకొచ్చారు. -
'చూద్దాం ఎవరు నన్ను జైల్లో పెడతారో'
ముంబై: డెరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్‌సింగ్ రాంరహీం సింగ్‌ను అనుకరించి హాస్యం పండించినందుకు టీవీ నటుడు, కామెడియన్ కికు శార్దాను అరెస్టు చేయడంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్రంగా ప్రతిస్పందించింది. కికు శార్దాకు అండగా నిలిచింది. తనను తాను 'రాక్‌స్టార్ బాబా'గా పేర్కొంటూ సినిమాలు చేస్తున్న గుర్మీత్‌సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ ప్రముఖులు రిషీ కపూర్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి వారు గుర్మీత్‌సింగ్ తీరును తప్పుబట్టారు. కికు శార్దాకు మద్దతుగా బాలీవుడ్ అలనాటి హీరో రిషీకపూర్ ట్విట్టర్లో స్పందించారు. గుర్మీత్ సింగ్ ఫొటోను చూపిస్తూ 'ఈ ఫొటోను చూడండి. ఈ రాక్‌స్టార్ తరహాలో నేను సినిమాలో నటించాలనుకుంటున్నా. చూద్దాం నన్ను ఎవరు జైల్లో పెడతారో' అని ట్వీట్ చేశారు. ఆరో తరగతి పాసై.. ఎంఎస్‌జీ వంటి సినిమాలు తీసే గుర్మీత్ రాం రహీంను ఎందుకు అరెస్టు చేయలేదని అనురాగ్ కశ్యప్ ట్విట్టర్లో ప్రశ్నించారు. ఘోర కలియుగంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతాయంటూ నెటిజన్లు కూడా కికు శార్దాను అరెస్టును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో ఫేమస్ అయిన కికు శార్దా తాను గుర్మీత్సింగ్ను అనుకరించడంపై క్షమాపణలు చెప్పారు. అయినా ఆయనను అరెస్టుచేసి.. బెయిల్‌పై విడుదల చేశారు. దీనిపై స్పందించిన గుర్మీత్‌సింగ్ కికు శార్దాను క్షమిస్తున్నట్టు తెలిపారు. See this picture!I would like to play this rockstar in a film. Let me see who puts me behind bars? Go Kiku Sharda! pic.twitter.com/8Dfre237NY — rishi kapoor (@chintskap) January 13, 2016 -
కామెడీ స్టార్ అరెస్ట్
ప్రముఖ టీవీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ లో పాలక్ గా కనిపించే కమేడియన్ కికు శర్ద అరెస్ట్ అయ్యాడు. సిర్సాకు చెందిన డేరా సచ్చా సౌదా వారి మతాచారాలను కించ పరిచే విధంగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఎ కింద బుధవారం ఉదయం ముంబైలో కికును అరెస్ట్ చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురు, సినిమా స్టార్ అయిన గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులు వేసిన కేసులో భాగంగా కికు శర్దను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2015 డిసెంబర్ 27న టెలికాస్ట్ అయిన టీవీ షోలో కికు శర్ద తమ గురువును అనుకరిస్తూ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన అనుచరులు కేసు పెట్టారు. దీనిపై అంతకు ముందే కికు క్షమాపణలు చెప్పినా అనుచరులు వినలేదు.