కామెడీ స్టార్ అరెస్ట్ | Comedy Nights With Kapil actor Kiku Sharda has been arrested | Sakshi
Sakshi News home page

కామెడీ స్టార్ అరెస్ట్

Published Wed, Jan 13 2016 4:19 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

కామెడీ స్టార్ అరెస్ట్ - Sakshi

కామెడీ స్టార్ అరెస్ట్

ప్రముఖ టీవీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ లో పాలక్ గా కనిపించే కమేడియన్ కికు శర్ద అరెస్ట్ అయ్యాడు. సిర్సాకు చెందిన డేరా సచ్చా సౌదా వారి మతాచారాలను కించ పరిచే విధంగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఎ కింద బుధవారం ఉదయం ముంబైలో కికును అరెస్ట్ చేశారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురు, సినిమా స్టార్ అయిన గురుమీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులు వేసిన కేసులో భాగంగా కికు శర్దను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2015 డిసెంబర్ 27న టెలికాస్ట్ అయిన టీవీ షోలో కికు శర్ద తమ గురువును అనుకరిస్తూ తమ మనోభావాలను దెబ్బతీశారని ఆయన అనుచరులు కేసు పెట్టారు. దీనిపై అంతకు ముందే కికు క్షమాపణలు చెప్పినా అనుచరులు వినలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement