న్యూఢిల్లీః బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భారత ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం ఢాకాలో జరిగిన దాడి ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐసిస్ ముష్కరులు జరిపిన దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మోదీ... గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఢాకాదాడులపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై తెలుసుకున్న ఆయన.. దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన పలు ట్వీట్లు చేశారు. ఢాకా దాడులు ఎంతో బాధను కలిగించాయని, ప్రధాని షేక్ హసీనాతోనూ, ఇతర అధికారులతోనూ మాట్లాడినట్లు తన ట్వీట్స్ లో తెలిపిన మోదీ.. దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యుల్లాంటి బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ధృఢంగా ఉండాలని మోదీ సూచించారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని కేఫ్ లో బంధించి, ఇస్టామిక్ స్టేట్ తీవ్ర వాదులు దారుణంగా చంపేసిన 20 మందిలో భారతదేశానికి చెందిన బాలిక తరుషి జైన్ కూడ ఉన్నట్లు విదేంశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.
ఢాకా దాడిని ఖండించిన మోదీ..
Published Sat, Jul 2 2016 5:23 PM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM
Advertisement
Advertisement