కారులో విషాదం.. ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి | 2 kids died in a car in west godavari district | Sakshi
Sakshi News home page

కారులో విషాదం.. ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి

Published Tue, Apr 19 2016 11:05 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

2 kids died in a car in west godavari district

భీమవరం(పశ్చిమగోదావరి): భీమవరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఇరుక్కుపోయిన ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతిచెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బ్యాంక్‌ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

స్థానిక కాలనీకి చెందిన తేజస్విని, లక్ష్మీదుర్గ(4), ఈశ్వరి(6) కారులో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు లాక్ పడిపోయింది. ఇది ఎవరు గుర్తించకపోవడంతో.. లక్ష్మీదుర్గ, ఈశ్వరి ఊపిరాడక కారులోనే మృతిచెందగా.. తేజస్విని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆలస్యంగా ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు తేజస్వినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement