![East Godavari: Twist In Rajanagaram Woman Kidnap Case - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/16/POLICE.jpg.webp?itok=u8QUb-lU)
సీసీటీవీ ఫుటేజీ, యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు
సాక్షి, తూర్పుగోదావరి: రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న యువతిని ఓ యువకుడు కిడ్నాప్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఆధారంగా కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. భీమవరంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన ఫణీంద్ర అనే యువకుడు లాంగ్ డ్రైవ్‌కు వెళ్దామని ఆమెను నమ్మించాడు. భీమవరం బులుసుమూడిలోని ఓ రూమ్‌లో యువతిని నిర్భంధించాడు. యువతి కాళ్లు చేతులు కట్టేసి చేతిపై కత్తితో దాడి చేశాడు. ఇదంతా వీడియో తీసి వాటిని యువతి తల్లిదండ్రులకు పంపించి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భీమవరంలో నిందితుడు ఫణీంద్రను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment