సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలో పరిష్కారం చూపారు. తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు.
చెక్కులు అందుకున్న వారి వివరాలు..
►కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు
►ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
►చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం
►కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం..
►తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం
►అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం
►గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం
తాడేపల్లి: విద్యాదీవెన నిధులు విడుదల చేయటంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.583 కోట్లను నేడు మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాల్లో రీయింబర్స్ చేశామని తెలిపారు. అలాగే దాదాపు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 27.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు కింద రూ.11,900 కోట్లను అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment