
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానిక బ్యాంక్ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రొయ్యల కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నారిశెట్టి వెంకట సునీల్ నలుగురు స్నేహితులతో కలిసి గతరాత్రి మద్యం సేవించాడు.
అనంతరం ఆ నలుగురు కలిసి సునీల్‌పై దాడి చేసి హత్య చేశారు. కాగా పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment