యూపీఏ రిమోట్ కంట్రోల్: మోడీ
చిక్కబళాపూర్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూపీఏ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రిమోట్ కంట్రోల్తో నడుస్తోందని అని విమర్శించారు. కేంద్రంలో స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరముందని మోడీ అన్నారు. కర్ణాటకలోని చిక్కబళాపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టదని, మరి కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమవుతుందని మోడీ జోస్యం చెప్పారు. 'భారత్లో ఎలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు? బలహీన ప్రభుత్వమా? రిమోట్ కంట్రోల్తో పాలన సాగించే వారా? దేశ భవిష్యత్ను, వాగ్ధానాలను, దేశాన్ని విభజించే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా' అంటూ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు. కేంద్రంలో సుస్థిర, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీకే సాధ్యమని అన్నారు.