ఏ రాష్ట్రం... ఎవరి పక్షం? | Election 2014 review in all states in India | Sakshi
Sakshi News home page

ఏ రాష్ట్రం... ఎవరి పక్షం?

Published Mon, Apr 7 2014 1:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ఏ రాష్ట్రం... ఎవరి పక్షం? - Sakshi

ఏ రాష్ట్రం... ఎవరి పక్షం?

‘‘కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న యూపీఏ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత తక్కువగా సీట్లకు పరిమితమవుతుంది.  వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన ఎన్డీఏకు ఈసారి కాస్త సానుకూల పరిస్థితి ఉంది.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితిలో మార్పు వచ్చింది...’’

 - వివిధ మీడియా సంస్థలు, రాజకీయ పండితులు, ఎన్నికల విశ్లేషకుల అంచనాలివీ. దశాబ్దంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై జనం అసంతృప్తితో పాటు ఆగ్రహంతో ఉన్నారు. యూపీఏ-2 హయాంలో వెల్లువెత్తిన కుంభకోణాలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస పరాజయాలు యూపీఏ ఓటమి ఖాయమనే అభిప్రాయానికి బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నిర్ణయాధికారం లేని ప్రధానిగా మన్మోహన్‌సింగ్ వ్యవహార శైలి కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయంటున్నారు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతంలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు భారీ సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో ఎన్డీఏకు వచ్చే సీట్లు నామ మాత్రమేనని, కాంగ్రెస్‌కు వచ్చే సీట్లలో మూడొంతులు దక్షిణాదిలోనే రావచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలోని టీఆర్‌ఎస్ వంటి ప్రాంతీయపార్టీలు దక్షిణాదిలో కూడా కాంగ్రెస్ బలం పెరగకుండా అడ్డుకునే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేటి నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమవుతున్న సందర్భంలో ప్రధాన రాష్ట్రాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల విజయావకాశాలపై విహంగ వీక్షణం...
 
ఊహకందని ఉత్తరప్రదేశ్
80 లోక్‌సభ సీట్లతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యుూపీ కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రెండేళ్లుగా అధికారంలో ఉన్న అఖిలేశ్ యాదవ్ అసమర్థ పాలన, శాంతి, భద్రతల పరిరక్షణలో వైఫల్యం బీజేపీ వుళ్లీ పుంజుకోవడానికి ఉపకరించేలా కనిపిస్తున్నారుు. ముజఫర్‌నగర్ వుత ఘర్షణల దరిమిలా వుుస్లింలు ఎస్పీకి దూరవుయ్యూరు. మోడీ రాకతో మతపరంగా జరుగుతున్న సమీకరణలు బీజేపీకి లాభించేలా ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో 20 వరకూ సీట్లు సంపాదించిన కాంగ్రెస్ కేంద్రంలో యుూపీఏ పాలన ఫలితంగా మూడు, నాలుగు సీట్లకే పరిమితవుయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరకంగా పడే ముస్లింల ఓట్లు ఈసారి చీలిపోకుండా వారంతా కాంగ్రెస్‌కే ఓటెయ్యలన్న ఢిల్లీ జవూ మసీద్ షాహీ ఇమాం బుఖారీ ఇచ్చిన పిలుపు హస్తం పార్టీకి పెద్దగా మేలుచేయుకపోగా, బీజేపీ వైపు హిందూ ఓటర్లు మొగ్గేలా చేయవచ్చని కొందరి అంచనా. రాష్ట్రంలో  బీఎస్పీకి ఈ పరిస్థితులు అనకూలించేలా లేవు. బీజేపీకి చాన్నాళ్ల తర్వాత ఇక్కడ 40 నుంచి 53 సీట్లు రావచ్చనీ, ఎస్పీ, బీఎస్పీలకు కలిపి 30 సీట్లు కూడా రావని కొన్ని సర్వేలు చెబుతున్నా.. బహుముఖ పోటీలుండే యుూపీలో ఈ సర్వేల ప్రకారం వాస్తవంగా ఫలితాలు ఎప్పుడూ రాలేదు. ఈసారీ ఇదే నిజమవుతుందని అంటున్నారు. వారణాసిలో మోడీ పోటీ, ఎస్పీ పాలనపై అసంతృప్తి, కాంగ్రెస్ డీలా పడడం బీజేపీకి అనుకూలించే అంశాలు.
 
 గుజరాత్: కోలుకోని కాంగ్రెస్
 ప్రధాని అభ్యర్థి, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి లోక్‌సభకు పోటీచేస్తున్న గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాల్లో ఇక్కడి పాలకపక్షమైన బీజేపీ కిందటిసారి 15 సీట్లు గెల్చుకుంది. గుజరాత్‌లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించడం, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెరిగింది. ప్రధాని అభ్యర్థి ఎంపికలో పార్టీ నాయకత్వపై దాదాపు తిరుగుబాటుకు సిద్ధమైన సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మళ్లీ గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ 20 నుంచి 23 సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత సీనియర్ కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి ఫిరాయించడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గె లిచే సీట్ల సంఖ్య ఐదుకు మించితే గొప్పే. ఆమ్‌ఆద్మీపార్టీ కూడా బరిలోకి దిగినా ఈ పార్టీకి ఐదారు శాతానికి మించి ఓట్లు పడకపోచ్చు.
 
 బీహార్: పొత్తు తెగినా..
 మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక బీజేపీతో 17 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు బీహార్ వుుఖ్యవుంత్రి, జేడీయుూ నేత నితీశ్ కువూర్. వుుస్లింల బద్ధ శత్రువుగా వుుద్రపడిన మోడీని బీహార్‌లో ఎన్నికల ప్రచారానికి రాకుండా చేసి, రెండు వరుస విజయూలతో ఎనిమిదన్నరేళ్లుగా అధికారంలో ఉన్న నితీశ్ గొప్ప సాహసమే చేశారు. ఆర్జేడీ పాలనతో పోల్చితే వుంచి పాలన అందిస్తూ ఆర్థికాభివృద్ధిలో కొత్త రికార్డు నెలకొల్పారు నితీశ్. అరుుతే, బీజేపీతో పొత్తు తెంచుకున్నాక బలపడిన మోడీ ప్రభంజనాన్ని మాత్రం ఆపలేకపోయూరు. ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి నుంచి రామ్‌విలాస్ పాశ్వాన్ నాయుకత్వంలోని ఎల్జేపీ బయుటపడి బీజేపీతో చేతులు కలపడం కాషాయు పార్టీ వురింత బలపడటానికి దారితీసింది. వుూడో కూటమిలోని సీపీఐతో వూత్రమే జేడీయుూకి పొత్తు ఉంది.

ఆర్జేడీ నేత లాలూప్రసాద్ తన కుటుంబ సభ్యులకు టికెట్లు కేటారుుంచడంతో ఆయున పార్టీ నుంచి రామ్‌కృపాల్ యూదవ్ వంటి కీలక నేతలు, జేడీయుూ నాయుకులు కొందరు బీజేపీలో చేరడంతో ఎన్డీఏ విజయూవకాశాలు పెరిగారుు. రాష్ర్టంలో 11 శాతం జనాభా ఉన్న యూదవుల్లో వుూడోవంతు జనం, ఇతర బీసీ కులాలు కూడా బీజేపీ వైపు మొగ్గుతున్నాయుని వార్తలొస్తున్నారుు. అందుకే, వివిధ సర్వేలు మొత్తం 40 సీట్లలో వుూడొంతులు బీజేపీ-ఎల్జేపీ కూటమి ఖాతాలోనే పడతాయని జోస్యం చెబుతున్నారుు. కాని, యుూపీ వూదిరిగానే బహువుుఖ పోటీలున్న బీహార్‌లో సర్వేల అంచనాలు నిజమైన సందర్భాలు తక్కువ. అరుునా, బీజేపీ కూటమికే అత్యధిక స్థానాలు రావచ్చుగాని, జేడీయుూకు ఇవి అంచనా వేసున్నట్టుగా వురీ అన్ని తక్కువ సీట్లు రావు.
 
 రాజస్థాన్ : బీజేపీకి నల్లేరుపై నడకే
 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థారుు విజయుం సాధించిన బీజేపీ, ఈ లోక్‌సభ ఎన్నికల్లో అంతేస్థారుులో ఘనవిజయుం సాధించి కొత్త రికార్డు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. నాలుగు నెలల కిందటే అధికారంలోకి వచ్చిన వసుంధర సర్కారుపై జనంలో అసంతృప్తి మొదలవడానికి కారణాలు లేవు. కొత్తగా గద్దెనెక్కిన ఏ ప్రభుత్వానికైనా ఏడాది లోపు జరిగే ఎన్నికల్లో విజయుమే దక్కుతుందనేది చరిత్ర చెబుతోంది. దీనికి తోడు మోడీ రాకతో సీనియుర్ నేత జశ్వంత్ సింగ్ తిరుగుబాటు చేసినా, బీజేపీ స్కోరు మొత్తం 25 సీట్లకుగాను 20 దాటితే ఈ పార్టీ అత్యధికంగా లబ్ధిపొందిన రాష్ట్రంగా నమోదవుతుంది. కేంద్రవుంత్రి సచిన్‌పైలట్ పీసీసీ పగ్గాలు చేపట్టడం కాంగ్రెస్‌కు సానుకూల పరిణావుమే. అరుుతే, ఫిరారుుంపులు, వుుఠా తగాదాలతో పార్టీ యుత్రాంగా బలహీనంగా ఉంది.
 
 మధ్యపద్రేశ్: కాంగ్రెస్‌కు వురో ఊబి
 గుజరాత్ తర్వాత బీజేపీ బలంగా వేళ్లూనుకున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. వుుఖ్యవుంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నాలుగు మాసాల కిందటే వుూడోసారి తిరిగి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కిందటిసారి కంటే ఎక్కువ స్థానాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పదేళ్లు సీఎం కుర్చీలో కూర్చున్న దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ ఆఖరి సీఎంగా రికార్డు స్థాపించడంతోపాటు గ్రూపు కీచులాటలతో ఆత్మవినాశనం చేసుకునే వారసత్వాన్ని వదిలిపోయూరు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవసరం లేకుండా ఆయున కొన్ని నెలల కిందట రాజ్యసభకు పోవడం కాంగ్రెస్ దుస్థితికి అద్దంపడుతోంది. గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన కేంద్రవుంత్రి జ్యోతిరాదిత్య సింధియూగాని, కొత్త పీసీసీ నేత అరుణ్ యూదవ్‌గాని పార్టీకి పట్టువుని పది సీట్లు గెలిపించే స్థితిలో లేరు. 2009లో 16 సీట్లలో విజయుం సాధించిన బీజేపీ బలం ఈసారి 24 వరకూ పెరగవచ్చని అంచనా. మొత్తం 29 సీట్లకుగాను 12 గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు నాలుగైదు సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితికి చేరుకుంది.
 
ఛత్తీస్‌గఢ్ పోటాపోటీ
2009 ఎన్నికల్లో మొత్తం 11కుగాను పది లోక్‌సభ సీట్లు కైవసం చేసుకున్న బీజేపీకి ఈసారి విజయూవకాశాలు అదే స్థారుులో లేవనే చెప్పాలి. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా నిండకున్నా బీజేపీ స్కోరు ఆరేడు సీట్లకు మించకపోవచ్చని తాజా సర్వేలు చెబుతున్నారుు. వుుఖ్యవుంత్రి రవుణ్‌సింగ్ అధికారం చేపట్టి పదేళ్లు దాటింది. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పది సీట్లు వూత్రమే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు కైవసం చేసుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల వుుందు దాదాపు కాంగ్రెస్ అగ్రనేతలందరూ వూవోరుుస్టుల దాడిలో వురణించడంతో కొన్ని ప్రాంతాల్లో జనం సానుభూతి కాంగ్రెస్‌కు కొంత అనుకూలించింది. అరుుతే, మోడీ ప్రభంజనం అనేది నిజంగా పనిచేస్తేనే వుళ్లీ పది సీట్లు బీజేపీలో ఖాతాలో పడతారుు.
 
చేజారనున్న హర్యానా
పది లోక్‌సభ సీట్ల కోసం హర్యానాలో నాలుగు పార్టీలు పోటీపడుతున్నారుు. ప్రస్తుత పాలకపక్షమైన కాంగ్రెస్ తొమ్మిదేళ్లుగా భూపీందర్‌సింగ్ హుడా నాయుకత్వంలో అధికారంలో ఉంది. అవినీతి, భూ కుంభకోణాలు, సోనియూ అల్లుడు రాబర్ట్ వాద్రాకు భూ కేటారుుంపులు రద్దుచేసిన ఐఏఎస్ అధికారి ఖేమ్కా వంటి అధికారులను వేధించడం-ఇవన్నీ కాంగ్రెస్‌ను జనానికి దూరం చేశాయి. మాజీ సీఎం భజన్‌లాల్ కుటుంబానికి చెందిన హర్యానా జనహిత్ కాంగ్రెస్(హెచ్‌జేసీ) ఈసారి బీజేపీతో పొత్తుపెట్టుకుని రెండు సీట్లలో పోటీ చేస్తోంది. 8 స్థానాల్లో పోటీపడుతున్న బీజేపీ తొలిసారి నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. అరుుతే ఆప్ అధినేత కే జ్రీవాల్, మరో ముఖ్యనేత యోగేంద్ర యూదవ్‌ల సొంత రాష్ట్రం కావడంతో బహుముఖపోటీ  తప్పడం లేదు.
 
ఒడిశాలో ‘శంఖం’ సత్తా
ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) గాలి వీస్తోంది. బీజేడీ నెయ్యాన్ని వదులుకున్నందుకు రాష్ట్రంలో బీజేపీ కోలుకోలేనంతగా నష్టపోయింది. 2009 ఎన్నికల్లో ఒక్క లోక్‌సభ స్థానాన్నయినా దక్కించుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా ఈసారి ‘నమో’జపం మార్మోగుతున్నా, ఒడిశాలో బీజేపీకి ఒక్క సీటైనా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో.. బీజేడీకి 17-18 స్థానాలు లభిస్తాయని అంచనా. మిగిలినవి కాంగ్రెస్ ఖాతాలో చేరతాయని సర్వేల్లో తేలింది.
 
ఉత్కంఠ రేపుతున్న పంజాబ్
13 సీట్లే ఉన్న పంజాబ్‌లో ఈసారి రెండు ప్రధాన రాజకీయ కూటముల మధ్య పోటీ హోరాహోరీగా ఉండేలా కనిపిస్తోంది. అకాలీ వృద్ధనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ నాయకత్వంలోని అకాలీ-బీజేపీ సంకీర్ణ సర్కారు 2007 నుంచి అధికారంలో కొనసాగడం విశేషం. రెండేళ్ల క్రితం జనం నుంచి  వ్యతిరేకత పెద్దగా లేకుండా మళ్లీ అధికారం చేపట్టింది. దాదాపు ఏడేళ్ల పాలనలో చెప్పుకోదగ్గ వైఫల్యాలు లేవు. పరిపాలన ఫర్వాలేదనే అభిప్రాయం జనంలో ఉంది. ఈ కారణంగా రెండు ప్రధాన పక్షాల్లో ఏది అత్యధిక సీట్లు గెలుచుకుంటుందో చెప్పటం కష్టం. కాంగ్రెస్‌కు ఏడు సీట్లు రావచ్చని కొందరు అంచనా వేస్తుండగా, అకాలీ-బీజేపీ కూటమికే అత్యధిక స్థానాలు దక్కుతాయని కొన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. సిక్కుల ప్రధాన కేంద్రం అమృత్‌సర్ నుంచి బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ, వూజీ కాంగ్రెస్ సీఎం అమరీందర్‌సింగ్ మధ్య జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోటీకి అమరీందర్ తొలుత వెనుకాడారంటేనే కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 
 ఉత్తరాఖండ్: కమలానికే అనుకూలం
ఐదు లోక్‌సభ స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో పరిస్థితి బీజేపీకే అనుకూలంగా ఉంది. గత ఏడాది వరదల సమయంలో జరిగిన జననష్టం, కాంగ్రెస్ సర్కారు వైఫల్యం, పార్టీలో ముఠా తగాదాల కారణంగా సీఎం మార్పు, మోడీ గాలి- ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా వూరేలా ఉన్నారుు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాక, బీఎస్పీ, ఇండిపెండెంట్ల సాయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ విజయావకాశాలు చాలా తక్కువ. వూజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎంపీ సత్పాల్ మహరాజ్ బీజేపీలో చేరడమే దీనికి ఉదాహరణ.
 
తమిళనాడు: అమ్మ హవా
 మూడేళ్ల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలో కొనసాగుతున్న అన్నాడీఎంకేకు జనాదరణ అదే స్థాయిలో కొనసాగుతోంది. రెండు ప్రధాన ప్రాంతీయపార్టీలైన ఏఐఏడీఎంకే, డీఎంకేలు ఏ జాతీయ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేస్తున్న ఎన్నికలివి. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయడం, పార్లమెంటు ఎన్నికల్లో యూపీఏకు విజయావకాశాలు లేవనే ప్రచారం, 2జీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతలు తమిళులే కావడంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూడబోతోందని అంచనా వేస్తున్నారు. మొదట సీపీఎం, సీపీఐతో పొత్తుకు అవగాహన కుదుర్చుకున్న జయలలిత తర్వాత సీట్ల సంఖ్య విషయంలో తలెత్తిన విభేదాల వల్ల పొత్తు రద్దుచేసుకున్నారు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకే, సీనీహీరో విజయకాంత్ పార్టీ డీఎండీకే, పీఎంకే వంటి మూడు నాలుగు స్థానిక పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టుకుని పోటీకి దిగింది. డీఎంకే కూడా చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టి ప్రయత్నమే చేస్తోంది. 39 సీట్లున్న తమిళనాడులో అన్నాడీఎంకేకు పాతిక వరకూ సీట్లొస్తాయని భావిస్తున్నారు.
 
పశ్చిమ బెంగాల్: పెరుగుతున్న ‘దీదీ’ బలం
2009 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న సీపీఎం నాయకత్వంలోని వామపక్ష ఫ్రంట్... రాష్ట్రంలో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఏళ్ల పాలన తర్వాత అధికారం కోల్పోయింది. తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ మూడేళ్ల పాలన తర్వాత కూడా సీపీఎం ఏమాత్రం పుంజుకోలేకపోగా అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రజాదరణను సైతం కోల్పోయిందనివ ఇప్పటి వరకూ జరిగిన సర్వేలు, వివిధ సంస్థలు, రాజకీయ పండితుల అంచనాల్లో తేలింది. సీపీఎం కార్యకర్తలు, నేతలపై దాడులు, మమత నియంతృత్వ ధోరణి, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు-ఇవేవీ తృణమూల్ పురోగమనాన్ని ఆపలేకపోతున్నాయాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 42 సీట్లలో తృణమూల్ కైవసం చేసుకున్న సీట్లు 19 కాగా, ఈసారి మరో పది సీట్లు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కాంగ్రెస్ బలం పెద్దగా తగ్గకపోవచ్చు. అయితే, వామపక్షాలకు దక్కే సీట్ల సంఖ్య మాత్రం మరింత దిగజారిపోచ్చని భావిస్తున్నారు. కిందటిసారి డార్జిలింగ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎస్ ఆహ్లూవాలియా ఇదే స్థానం నుంచి స్థానిక గూర్ఖాలాండ్ పార్టీ మద్దతుతో పోటీచేస్తున్నారు. ఈ సీటు నిలబె ట్టుకోవడం బీజేపీకి అంత తేలిక కాదు.
 
 మహారాష్ర్ట: కాంగ్రెస్ కూటమికి కష్టకాలం
 యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ సీట్లున్న(48) మహారాష్ట్ర.. కాంగ్రెస్‌కు బలమైన పునాదులున్న ఏకైక రాష్ట్రమని చెప్పవచ్చు. అవినీతి కుంభకోణాలు, రైతుల ఆత్మహత్యలు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో కీచులాటలు ఈ ఎన్నికల్లో పాలకపక్షం విజయావకాశాలను దెబ్బదీసే అంశాలు. శివసేన చీలికవర్గమైన ఎంఎన్‌ఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులున్న సీట్లలో అభ్యర్థులను నిలపకపోవడం, మోడీ గాలి, బీజేపీ-శివసేన కూటమికి కలిసొచ్చే అంశాలు. ఆదర్శ్ కుంభకోణం ఫలితంగా సీఎం పదవి కోల్పోయిన అశోక్ చవాన్ వంటి నేతలకు కాంగ్రెస్ టికెట్లివ్వడం కూడా ఈ పార్టీకి నష్టదాయకమే. కాంగ్రెస్ సీఎం పృథ్వి రాజ్ చవాన్‌పై అవినీతి ఆరోపణలు లేకున్నా సర్కారుపై జనంలో అసంతృప్తి ఉంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదు. ఇప్పటి వరకూ ప్రకటించిన అన్ని ఎన్నికల సర్వేల ఫలితాలు కూడా బీజేపీ కూటమికి పాతిక సీట్లొస్తాయని వెల్లడించాయి.
 
 అసోం: గొగోయ్ ఆధిపత్యమే..
 ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ నాయకత్వంలో దాదాపు 13 ఏళ్లక్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి అసోంలో తన ఆధిపత్యం ప్రదర్శించబోతోంది. కిందటేడాది బోడోలు నివసించే ప్రాంతాల్లో ముస్లింలకు వారికి మధ్య ఘర్షణలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ప్రాంతీయ, జాతి విభేదాలు, ఉద్యమాలు ఇంకా చల్లారలేదు. అయినా, ఉన్నంతలో మెరుగైన పాలన అందిస్నున్నారనే పేరు గొగోయ్‌కి ఉంది. ముస్లింలు దాదాపు 40 శాతం ఉన్న ఈ రాష్ట్రంలో 2009ల్లో కాంగ్రెస్‌కు ఏడు, బీజేపీకి నాలుగు సీట్లు లభించాయి. అసోం గణపరిషత్ ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఏయూడీఎఫ్, బోడోల పార్టీ బీపీపీఎఫ్‌లు చెరో సీటు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే అధిక సీట్లు దక్కవచ్చంటున్నారు.
 
కర్ణాటక: కాంగ్రెస్‌కే మొగ్గు?
11 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకుంది. ఏడాది లోపు జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీయే అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడం సహజ పరిణామం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలనపై కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి ఉన్న సూచనలేవీ కనిపించడం లేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప మళ్లీ వెనక్కిరావడం, బీఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత బీఎస్ శ్రీరాములు బళ్లారిలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం కాషాయ పార్టీకి అనుకూలించే విషయాలు. ఐదేళ్ల పాలనలో ప్రజల ఆగ్రహానికి గురైన బీజేపీ ఈ ఎన్నికల్లో పెద్దగా కోలుకునే అవకాశాలు లేవు. మోడీ ప్రచారం, కేంద్రంలో ఎన్డీఏకు అవకాశాలు కనిపించడం వల్ల బీజేపీకి లభించే లోక్‌సభ సీట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండకపోవచ్చు. ఒక సర్వేలో మాత్రం బీజేపీకి 16 సీట్లు వస్తాయని అంచనావేసినా, అత్యధిక సర్వేలు కాంగ్రెస్‌కే మొగ్గు ఉన్నట్టు చెబుతున్నాయి. 2009లో బీజేపీకి 18 సీట్లు రాగా, కాంగ్రెస్ ఆరు సీట్లతో సరిపెట్టుకుంది. మొత్తం 28 సీట్లున్న ఈ రాష్ట్రంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీ-ఎస్ ఒకటి రెండు సీట్లకే పరిమితం కావచ్చు.
 
 జార్ఖండ్: పాలకపక్షానికి ఎదురు గాలి
 రాజకీయు అస్థిరతకు వూరుపేరైన జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్, ఆర్జేడీ సంకీర్ణ సర్కారు అధికారంలో ఉంది. బీజేపీతో ఓసారి, కాంగ్రెస్‌తో వురోసారి చేతులు కలిపే జేఎంఎం పాలన పాలక కూటమికి ఈ ఎన్నికల్లో సీట్లు గెలిపించేలా లేదు. ఇతర హిందీ ప్రాతాల వూదిరిగానే బీజేపీకి అనుకూల వాతావరణం ఇక్కడ కూడా కనిపిస్తోంది. మొత్తం 14 సీట్లకుగాను బీజేపీ పది వరకూ గెలుచుకోవచ్చు. సీనియుర్ బీజేపీ నేత, కేంద్ర వూజీ వుంత్రి యుశ్వంత్ సిన్హా ఈసారి పోటీలో లేరు. హజారీబాగ్ స్థానంలో తన కొడుకు జయుంత్‌ను బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు.
 
 కేరళ: హోరాహోరీ
 ప్రతి ఐదేళ్లకూ పాలక కూటమిని మార్చే అలవాటున్న రాష్ర్టం కేరళ. అలాగే, వరుసగా ఏ రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్‌లలో ఏ ఒక్కటీ అత్యధిక సీట్లు గెలిచిన సందర్భాలు లేవు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పాలనపై భిన్నాభిప్రాయాలున్నాయి. సీపీఎంలో అంతర్గత కీచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ నుంచి వైదొలిగి సొంత పార్టీ పెట్టుకున్న టీపీ చంద్రశేఖరన్ హత్యలో పార్టీ నేతల ప్రమేయంపై వచ్చిన అభియోగాలు సీపీఎం ప్రతిష్టను దెబ్బదీశాయి. ఒకట్రెండు సర్వేలు సీపీఎం కూటమికి అనుకూల ఫలితాలుంటాయని జోస్యం చెప్పినా, పాలకపక్షమై యూడీఎఫ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
 
 ఢిల్లీ: త్రిముఖ పోటీ
దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీల వుధ్యే మొత్తం 7 లోక్‌సభ సీట్లు అటూ ఇటూ మారుతుండేవి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాకతో తొలిసారి ఢిల్లీలో ముక్కోణపు పోటీలు జరుగుతున్నాయి. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ లేకున్నా ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మైనారిటీ సర్కారు 49 రోజులు నడిచింది. కానీ, ఆప్‌కు అప్పటి జనాదరణ  ఇప్పుడు లేదని అంటున్నారు. అదే నిజమైతే బీజేపీకి అత్యధిక సీట్లు దక్కే అవకాశాలున్నాయి. కేంద్రమంత్రి కపిల్ సిబల్ సైతం చాందినీచౌక్‌లో తీవ్రపోటీ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచే ఒకటి రెండు సీట్లు కూడా ఆప్ పోటీ వల్లే సాధ్యమవుతాయని చెప్పవచ్చు. ఆప్‌కు ఒకటి రెండు సీట్లు మించి గెలిచే అవకాశాలు లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement