కేంద్ర ప్రభుత్వోద్యోగుల డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ఫిబ్రవరి 28న తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ సర్కారు గురువారం నోటిఫై చేసింది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ ఫిబ్రవరి 28న తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ సర్కారు గురువారం నోటిఫై చేసింది.
డీఏ పెంపు వల్ల సుమారు 50 లక్షల మంది ఉద్యోగులకు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో తెలిపింది. పెంపు వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.11,074 కోట్ల భారం పడనుంది.