
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టినరోజు పురస్కరించుకుని నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రాజెక్టు తమ హయాంలోని ప్రారంభమైందని కరాఖండిగా కాంగ్రెస్ చెబుతుంది. తాము ఈ ప్రాజెక్టు చిరుత ప్రతిపాదనను 2008-09లోనే సిద్ధం చేశామని పేర్కొంది.
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దీన్ని ఆమోదించిందని కూడా కాంగ్రెస్ పేర్కొంది. ఐతే 2013లో సుప్రీం కోర్టు ఈ ప్రాజెక్టుపై స్టే విధించిందన్న విషయాన్ని గుర్తు చేసింది. మళ్లీ 2020లో సుప్రీం కోర్టు అనుమతితో చిరుతలు భారత్‌కి తిరిగి రావడానికి మార్గం సుగమమైందని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పేర్కొంది. అంతేగాదు అప్పటి అటవీ పర్యావరణ మంత్రి జైరామ్ రమేష్ 2010లో ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో చిరుత జౌట్‌రిచ్ సెంటర్‌కు వెళ్లినట్లు కూడా తెలిపింది. నాటి ఫోటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
'प्रोजेक्ट चीता' का प्रस्ताव 2008-09 में तैयार हुआ।
— Congress (@INCIndia) September 16, 2022
मनमोहन सिंह जी की सरकार ने इसे स्वीकृति दी।
अप्रैल 2010 में तत्कालीन वन एवं पर्यावरण मंत्री @Jairam_Ramesh जी अफ्रीका के चीता आउट रीच सेंटर गए।
2013 में सुप्रीम कोर्ट ने प्रोजेक्ट पर रोक लगाई, 2020 में रोक हटी।
अब चीते आएंगे pic.twitter.com/W1oBZ950Pz
(చదవండి: కునో పార్క్‌లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫొటోలు తీస్తూ..)
Comments
Please login to add a commentAdd a comment