* పెరిగిన సాగు రుణాల పరిమితి
* వ్యవసాయ వృద్ధి రేటు 4.6 శాతం
* రికార్డు స్థాయిలో పంటల దిగుబడి
న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం వ్యవసాయదారులను ఆకర్షించేందుకు బడ్జెట్‌లో ‘పోషక ఎరువుల’ ఎర వేసింది! 2014-15 బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.8 లక్షల కోట్లకు పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతులు 2.80 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు ఆర్థికమంత్రి చిదంబరం తెలిపారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఆహార చట్టం ద్వారా దేశ జనాభాలో 67 శాతం మంది తిండి గింజలను చౌకగా పొందేలా చట్టపరమైన హక్కు కల్పించామన్నారు.
- వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఈ ఏడాది 4.6%కి చేరుకునే అవకాశం.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల పరిమితిని రూ.7 లక్షల కోట్లుగా నిర్దేశించగా రూ.7.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
- వ్యవసాయ రుణాలపై వడ్డీ తగ్గింపు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగింపు. 2006-07లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు రూ.23,924 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు.
- పదేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 213 మిలియన్ టన్నుల నుంచి 263 మిలియన్ టన్నులకు పెంపు. 2012-13లో 255 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది.
- ఈసారి చక్కెర, పత్తి, తృణ ధాన్యాలు, నూనె గింజలు రికార్డు స్థాయిలో దిగుబడి నమోదయ్యే అవకాశం.
- 2012-13లో రూ.2.54 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి.
మంచి పరిణామం: ఎంఎస్ స్వామినాథన్
వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకోవటం మంచి పరిణామం. పెరిగిపోతున్న సాగు ఖర్చులు, వ్యవసాయంపై దేశంలోని యువత పెద్దగా ఉత్సాహం చూపని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది సరైన చర్య.
పొలాలకు పోషక ఎరువులు!
Published Tue, Feb 18 2014 3:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement