యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్ | UPA hat-trick to be done in elections, says Vayalar ravi | Sakshi
Sakshi News home page

యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్

Published Fri, Apr 18 2014 1:14 AM | Last Updated on Sat, Aug 25 2018 5:25 PM

యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్ - Sakshi

యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్

సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి ధీమాగా చెప్పారు. ఎన్నికల తరువాత తాను తిరిగి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి వస్తానన్నారు. గురువారం ఇందిరాభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి వీస్తోందన్నది మీడియా సృష్టేనని, ఎక్కడా ఆ ప్రభావం లేదన్నారు. సీమాంధ్రలో కేవలం చంద్రబాబు మాత్రమే మోడీ గాలి అంటూ భ్రమల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల తరువాత పరిస్థితులను అనుసరించి ఎవరెటు వెళ్తారో దాన్ని బట్టి మూడో ఫ్రంట్ ఉనికిలోకి వస్తుందన్నారు. దేశంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement