vayalar ravi
-
యూపీఏ హ్యాట్రిక్ ఖాయం: వయలార్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో యూపీఏ వరుసగా మూడో విజయం (హ్యాట్రిక్) సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్రమంత్రి, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వయలార్ రవి ధీమాగా చెప్పారు. ఎన్నికల తరువాత తాను తిరిగి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి వస్తానన్నారు. గురువారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశంలో మోడీ గాలి వీస్తోందన్నది మీడియా సృష్టేనని, ఎక్కడా ఆ ప్రభావం లేదన్నారు. సీమాంధ్రలో కేవలం చంద్రబాబు మాత్రమే మోడీ గాలి అంటూ భ్రమల్లో ఉన్నారని చెప్పారు. ఎన్నికల తరువాత పరిస్థితులను అనుసరించి ఎవరెటు వెళ్తారో దాన్ని బట్టి మూడో ఫ్రంట్ ఉనికిలోకి వస్తుందన్నారు. దేశంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కు వస్తాయని, యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. -
వైఎస్ఆర్ లాంటి నాయకత్వం ఇప్పుడు లేదు: వయలార్
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం లాంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో లేదని కేంద్ర మంత్రి వయలార్ రవి బుధవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. 2009 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితులను పోల్చలేమన్నారు. వివిధ నివేదికల ఆధారంగానే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్ల ఎంపిక జరిగిందన్నారు. ఈ సారి కొత్త వారికి అవకాశం ఇచ్చామని తెలిపారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలోనూ మెజార్టీ సీట్లు గెలుచుకుంటామన్నారు. అయితే రాష్ట్ర విభజనపై కామెంట్ చేసేందుకు ఆయన నిరాకరించారు. విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం గౌరవిస్తానని చెప్పారు. -
వాయలార్‌కు రెండు రాష్ట్రాల ఎన్నికల బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర), తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి వాయలార్ రవికి పార్టీ అధినేత్రి సోనియా అప్పగించారు. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ ప్రచారం, వ్యూహాల అమలు వంటివన్నీ ఆయన పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. మంగళవారం హైదరాబాద్ వచ్చిన రవి వారం రోజులు ఇక్కడే ఉండనున్నారు. ఆయనకు వసతి, సహాయకులను సీమాంధ్ర పార్టీ కార్యాలయమే ఏర్పాటుచేసింది. మంగళవారం ఇందిరాభవన్‌లో జరిగిన సీమాంధ్ర అభ్యర్థులకు బీఫారాల పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీమాంధ్ర రెండో జాబితా విడుదలపై పార్టీ నేతలతో చర్చించారు. -
ఏపీ స్క్రీనింగ్ కమిటీ ఇన్చార్జిగా వాయలార్
లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర కమిటీలో వాయలార్‌తో పాటు దిగ్విజయ్, బొత్స, కిరణ్, భక్తచరణ్‌దాస్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు జనవరి చివరినాటికి దేశవ్యాప్తంగా 150-200 మంది అభ్యర్థులతో జాబితా రూపొందించనున్నాయి. సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు పార్టీ అధినేత సోనియాగాంధీ ఆమోదముద్ర కూడా వేశారు. ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీకి పార్టీ సీనియర్ నేత వాయలార్ రవి నేతృత్వం వహించనున్నారు. గోవా, కర్ణాటక కమిటీలకు కూడా ఈయనే ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. మొత్తం ఐదుగురితో కూడిన ఈ కమిటీలో సంబంధిత రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నాయకుడితోపాటు మరొక రు సభ్యులుగా ఉంటారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో వాయలార్ రవితోపాటు దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ, సీఎల్పీ నాయకుడు కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఐదో సభ్యుడిగా భక్త చరణ్ దాస్ ఉండనున్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ నేత జి.చిన్నారెడ్డిని అరుణాచల్‌ప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఈనెల 17న ఏఐసీసీ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఈ ప్రక్రియ ముగియగానే ఈ స్క్రీనింగ్ కమిటీలు పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. అభ్యర్థుల పేర్లను ముందుగానే ఖరారు చేయాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని గతంలో కూడా ఆంటోనీ కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగంగానే సాగనుంది. మొత్తమ్మీద ఈనెల చివరినాటికి 150-200 మంది అభ్యర్థులతో ఒక జాబితా తయారు చేయాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వలేం: సిట్టింగ్ ఎంపీలందరికీ టికెట్లు దక్కకపోవచ్చని పార్టీ సంకేతాలు పంపింది. యూపీఏ పదేళ్లపాటు అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీ
ఢిల్లీ: రానున్న 2014 ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 2014 లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికకు స్ర్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర మంత్రి వయలార్ రవిని నియమించినట్టు సమాచారం. ఈ స్ర్కీనింగ్ కమిటీలో ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్తచరణ్ దాస్తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దిగ్విజయ్‌సింగ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలను సభ్యులుగా నియమించినట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలకు స్ర్కీనింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. -
కిరణ్ కాంగ్రెస్‌లోనే ఉంటారు: వాయలార్
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అని కేంద్రమంత్రి వాయలార్ రవి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారనేది మీడియా ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ నష్టపోతుందనేది ముఖ్యమంత్రి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని వాయలార్ రవి అన్నారు. కాగా కిరణ్ సొంత పార్టీ పెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన తాజా వ్యవహార శైలి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తావిస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చిన ఆ పార్టీ అధిష్టానం, సొంత నేతలతోనే ‘వ్యతిరేక రాగం’ విన్పించి, కొత్త పార్టీ పెట్టించి, ఆ ముసుగులో ఎన్నో కొన్ని ఓట్లు, సీట్లు రాబట్టుకోవాలని వ్యూహరచన చేసినట్టు పీసీసీ వర్గాల్లోనే చాలాకాలంగా విన్పిస్తుండటం తెలిసిందే. తాజా పరిణామాలు, సీఎం చర్యలన్నీ అందులో భాగంగానే కన్పిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
విదేశాల్లో పనిచేసే భారతీయ కార్మికులకు ‘భద్రత’
దుబాయ్‌లో ఎంజీపీఎస్‌వై పథకాన్ని ప్రవేశపెట్టిన వాయలార్ రవి దుబాయ్: విదేశాల్లో పనిచేసే ప్రవాస భారతీయులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ప్రవాసి సురక్ష యోజన (ఎంజీపీఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి సోమవారం దుబాయ్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) దేశాల్లో పనిచేసే దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొంద నున్నారు. ఎంజీపీఎస్‌వైలో చేరే కార్మికులు సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.12,000 చందా కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వం తన వాటాగా రూ.1,000 కడుతుంది. మహిళా కార్మికులు అయితే అదనంగా మరో రూ.1,000 చెల్లిస్తుంది. దీంతోపాటు కార్మికులు విదేశాల్లో పనిచేస్తున్నంతకాలం జీవిత బీమా సౌకర్యం కల్పిస్తుంది. పని పూర్తయ్యాక భారత్‌కు తిరిగి రాగానే వారికి సొమ్ము అందజేస్తుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, భద్రతకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా వాయలార్ రవి చెప్పారు.