దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం లాంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో లేదని కేంద్ర మంత్రి వయలార్ రవి బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. 2009 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితులను పోల్చలేమన్నారు. వివిధ నివేదికల ఆధారంగానే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్ల ఎంపిక జరిగిందన్నారు.
ఈ సారి కొత్త వారికి అవకాశం ఇచ్చామని తెలిపారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలోనూ మెజార్టీ సీట్లు గెలుచుకుంటామన్నారు. అయితే రాష్ట్ర విభజనపై కామెంట్ చేసేందుకు ఆయన నిరాకరించారు. విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం గౌరవిస్తానని చెప్పారు.