ఎస్‌బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం! | SBI plays down reports of Bharatiya Mahila Bank merger | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!

Published Wed, Jul 1 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

ఎస్‌బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!

ఎస్‌బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!

ఆర్థికశాఖ పరిశీలనలో కీలక ప్రతిపాదన
ముంబై:
కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 2013లో ‘మహిళల కోసం’ ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) త్వరలో తెరమరుగుకానుందా? ఈ బ్యాంకును దేశీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.  తుది నిర్ణయం ఏదీ ఇప్పటివరకూ  తీసుకోకపోయినా... విలీన ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.  రూ.1,000 కోట్ల తొలి మూలధనంగా బీఎంబీ ప్రారంభమైంది.
 
నాకు తెలియదు: ఎస్‌బీఐ చీఫ్
కాగా ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను క్యాబినెట్‌లో చర్చించివుండవచ్చని సైతం అభిప్రాయపడ్డారు.  ఈ విలీనం జరిగితే ఎస్‌బీఐకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సైతం ఆమె వ్యాఖ్యానించారు. అతి చిన్న బ్యాంక్ అయినప్పటికీ, అది విలీనానికి ఎటువంటి అడ్డంకీ కాబోదన్నారు.
 
బీఎంబీ గురించి...
ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో దాదాపు 60 శాఖలు ఉన్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో బీఎంబీ అన్‌లిస్టెడ్ సంస్థ. మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటయ్యింది. 2013-14లో ఆదాయం రూ.45.29 కోట్లు. 2014 మార్చి నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.175 కోట్లు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement