నెహ్రూ కుటుంబం స్మృతిలో దశాబ్దాలుగా వివిధ రకాల పోస్టల్ స్టాంపులను ముద్రించడంపై కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం కూడా వివాదాలకు దారితీయడం గర్హనీయం. చూడబోతుంటే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చింది ఆ కుటుంబంలోని వారే తప్ప మరె వ్వరూ కాదన్నట్లుగా ఇన్నాళ్లూ ప్రభుత్వాలు వ్యవహరించాయి. సోనియా గాంధీ పరోక్ష నేతృత్వంలో యూపీఏ పదేళ్ల పాలనలో 400 స్కీములు, విద్యా సంస్థలు, ప్రాజెక్టులు, సంక్షేమ చర్యలకు రాజీవ్, ఇందిర, నెహ్రూల పేర్లు మాత్రమే పెడుతూ వచ్చారు.
ఇంతకూ రాజీవ్ ఘనత ఏమిటి? ప్రధానమంత్రిగా ఆయన పనిచేసిన ఐదేళ్ల కాలంలోనే కాంగ్రెస్‌ను అటు లోక్‌సభలోనూ, పలు రాష్ట్రాల అసెంబ్లీలలోనూ శాశ్వత మైనారిటీలోకి దిగజార్చివేశారు. సొంతపార్టీకి ఆయన కట్ట బెట్టిన మహా గొప్ప విజయం అదేమరి. అలాంటిది.. ఆయన గతించిన తర్వాత అంత ప్రాధాన్యత నిచ్చి దేశంలో ప్రతి పథకానికీ ఆయన పేరును తగిలించడం సమంజసం మాట అటుంచి హాస్యాస్పదం.
రాజీవ్ విషయం అలా ఉంచితే దేశంలో అనేకమంది కాంగ్రెసేతర, నెహ్రూ కుటుం బేతర నేతలు, జాతి నిర్మాతలు, దేశభక్తిపరులు ఉనికిలోకూడా లేకుండా అనామకులుగా ఉండిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ఇలాంటి వారిని పార్టీలకు అతీతంగా గుర్తించి పోస్టల్ స్టాంపులు వంటి వాటి ద్వారా వారిని వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉంది.
డాక్టర్ టి.హెచ్. చౌదరి కార్ఖానా, సికిందరాబాద్
ఇప్పటికీ వాళ్లేనా?
Published Fri, Sep 25 2015 1:21 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement