సదా నిరాశే.. | Vijayawada - New Delhi to AC train | Sakshi
Sakshi News home page

సదా నిరాశే..

Published Wed, Jul 9 2014 4:08 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

సదా నిరాశే.. - Sakshi

సదా నిరాశే..

సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : యూపీఏ సర్కారు తరహాలోనే భారీగా పన్నుల భారం మోపిన మోడీ ప్రభుత్వం.. దానికి తగిన విధంగా విజయవాడ డివిజన్‌పై వరాల జల్లులు కురిపించలేకపోయిందని రైల్వే ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ కేంద్రంగా కొత్త రైల్వే జోన్, ఇక్కడి నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రైళ్లు, నగరంలో శాటిలైట్ స్టేషన్, జనసాధారణ్ రైళ్లు నడపడం, రైళ్ల వేగం పెంచడం వంటి హామీలన్నీ ఈ ప్రాంతవాసులకు కలగానే మిగిలిపోయాయి.
 
విజయవాడ-న్యూఢిల్లీ ఏసీ రైలు

విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఏసీ రైలు వేశారు. ఇది కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు దీనివల్ల ఒరిగిందేమీ లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. జనసాధారణ్, ఎక్స్‌ప్రెస్, పాసింజర్, డెమో రైళ్ల  
 
కొత్తదనమేమీ లేదు
రైల్వే బడ్జెట్‌లో కొత్తదనం లేదు. బడ్జెట్‌కు ముందే చార్జీల మోత మోగించారు కాబట్టి, ప్రస్తుతం చార్జీల ఊసే ఎత్తలేదు. విజయవాడ డివిజన్‌కు ఒక్క రైలు మినహా ఏం మంజూరు చేయలేదు. మోడీ ప్రభుత్వం రైల్వే మోడరనైజేషన్ వైపు అడుగులు వేస్తోందని ఈ బడ్జెట్‌ను చూస్తే అర్థమవుతోంది. ప్రరుువేటీకరణ చేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడతారు.
- స్వామిచరణ్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సీనియర్ సభ్యుడు
 
కలలు కల్లలే అయ్యూరుు..
స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే బడ్జెట్‌ను రూపొందించలేదని స్పష్టమైంది. జిల్లావాసుల చిరకాల వాంఛ మచిలీపట్నం-    రేపల్లె లైను నిర్మాణ విషయం ప్రస్తావించకపోవడం బాధాకరం. నర్సాపురం-మచిలీపట్నం రైలు ఏర్పాటుచేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నా ఫలితం లేదు. ఇది జిల్లా ప్రజలకు నిరాశాజనకంగానే ఉంది.
 - బి.ధన్వంతరి ఆచార్య, హిందూ కళాశాలల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు
 
చేదు మాత్ర..
నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే.. రైల్వే చార్జీలు పెంచడం దారుణం.              రైల్వేమంత్రి సొంత రాష్ట్రమైన కర్ణాటకు భారీ ప్రయోజనాలు చేకూర్చే విధంగానే బడ్జెట్ ఉంది. మచిలీపట్నం-విజయవాడ డబ్లింగ్ లైన్ల విషయంపై కూడా స్పష్టమైన ప్రకటన రాలేదు. మొత్తానికి రైల్వే బడ్జెట్ మొత్తం చేదుమాత్రలా ఉంది.
- దోసపాటి జగన్మోహనరావు, వైద్యుడు
 
 నీటిమూటలే..
విజయవాడ-భీమవరం ఎలక్ట్రికల్ డబుల్ లైన్ ప్రతిపాదన గత ప్రభుత్వంలోనే మంజూరైనప్పటికీ ఈ బడ్జెట్‌లో నిధులు కేటారుుంచలేదు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. కేవలం రెండే రెండు కొత్త రైళ్లు వేసి చేతులు దులిపేసుకున్నారు.
- ఏవీఆర్ రాజు, అడ్వకేట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement