యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల పుట్ట: వెంకయ్యనాయుడు
సీబీఐ అధికారులను అధైర్యపరచే విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిందంబరం మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత ఎం వెంకయ్యనాడు ఆరోపించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎదుర్కొలేనన్ని కుంభకోణాలను యూపీఏ ప్రభుత్వం ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల పుట్ట అని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రభుత్వ హయాంలో వచ్చిన కుంభకోణాలన్ని అటు కోర్టులు ఇటు మీడియా, కాగ్ సంస్థలే వెలుగులోకి తెచ్చాయన్నారు.
దాంతో యూపీఏ ప్రభుత్వంపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయని, దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో నెలకొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ఓ వైపు కేంద్ర మంత్రులు మరోవైపు రాష్ట్ర మంత్రులు ఇష్టమెచ్చిన రీతిలో మాట్లాడుతూ... ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని వెంకయ్యనాయుడు వెల్లడించారు.