బాధ్యతలు స్వీకరించిన బార్ కార్యవర్గం
Published Thu, Aug 25 2016 1:23 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(లీగల్) : ఇటీవల జరిగిన నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు బార్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలను స్వీకరించారు. మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం బాధ్యతలను అప్పగించారు. అధ్యక్షుడిగా ఫణిరత్నం, ఉపాధ్యక్షుడిగా రవికుమార్, జనరల్ సెక్రటరీగా రోజారెడ్డి, జాయింట్ సెక్రటరీగా రమణారెడ్డి, కోశాధికారి సుభానీ, లైబ్రరీ సెక్రటరీగా శివశంకర్, సీనియర్ ఈసీ మెంబర్లుగా మస్తానయ్య, శంకరయ్య, సత్యకుమార్, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ మెంబర్లుగా రియాజ్‌బాషా, ఝాన్సీ, రాజేష్, రమణారెడ్డి, రమణయ్య, లేడీ రెప్రజెంటేటివ్‌గా రామలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
Advertisement