దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం | dasari narayanarao recovering, says kims doctors | Sakshi
Sakshi News home page

దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం

Published Wed, Feb 1 2017 5:13 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం

దాసరిని ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాం

హైదరాబాద్‌: కిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు కిడ్నీల పనితీరు బాగానే ఉందని ఆస్పత్రి ఎండీ భాస్కరరావు చెప్పారు. మంగళవారం ఆయనకు డయాలసిస్ చేశామని, ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. బుధవారం సాయంత్రం దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా దాసరి కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాసరి కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.

(చదవండి: ఆస్పత్రిపాలైన ప్రఖ్యాత తెలుగు దర్శకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement