దాసరి హెల్త్ బులెటిన్ విడుదల | health bulletin says dasari narayana rao is stable | Sakshi
Sakshi News home page

దాసరి హెల్త్ బులెటిన్ విడుదల

Published Tue, May 30 2017 6:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

దాసరి హెల్త్ బులెటిన్ విడుదల

దాసరి హెల్త్ బులెటిన్ విడుదల

తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దర్శక నిర్మాత డాక్టర్ దాసరి నారాయణరావు హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన అన్నవాహికకు రీకన్‌స్ట్రక్టివ్ శస్త్ర చికిత్స చేశామని, ఆ తర్వాత ఆయనకు మూత్రపిండాలలో సమస్య తలెత్తిందని వివరించారు. అందువల్ల ఆయనకు ప్రస్తుతం హిమో డయాలసిస్ చేస్తున్నట్లు అందులో తెలిపారు. ఆయన ఐసీయూలో ఉండి చికిత్స పొందుతున్నారని, ఆయనను నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని చెప్పారు.

దాసరి నారాయణరావు ఆరోగ్యం ఇప్పటికి నిలకడగానే ఉందని కిమ్స్ వైద్యులు ఆ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వారం రోజుల క్రితం కిమ్స్‌లో చేరిన దాసరి ఆరోగ్యం కొంతవరకు విషమించినట్లు తొలుత కథనాలు వచ్చాయి. మోహన్‌బాబు, ఆర్ నారాయణమూర్తి తదితరులు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement