ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. దాసరికి చెస్ట్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని ఆయన వివరించారు. ఇప్పుడైతే ఆయన చాలా బాగున్నారని, రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకేమీ చెప్పలేనని డాక్టర్ భాస్కరరావు అన్నారు.