
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం వెంటనే నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే రాంరెడ్డి గత కొంత కాలం నుంచి కేన్సర్ సంబంధిత వ్యాధితో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. 2014లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.