అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స పొందుతున్న దాసరిని కలిసిన పవన్ అనంతరం డాక్టర్లతో ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాసరి నారాయణరావు త్వరలో కోలుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. మూడు రోజుల క్రితం మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా దర్శకరత్న దాసరి కిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.