సాక్షి, గచ్చిబౌలి: నెలలు నిండక ముందే జన్మించిన (28 వారాలు) ఆడ శిశువు గుండెకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. చందానగర్‌కు చెందిన అనిత, రాకేష్ సింగ్ దంపతులకు గత ఏప్రిల్ 21న ఆడపిల్ల జన్మించింది. సాధారణంగా నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువు (1100 గ్రాముల బరువు) బతికే అవకాశాలు తక్కువ. పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ సమస్య ఉండటంతో రెండు ప్రధాన రక్త నాళాల మధ్య ఖాళీ ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు చికిత్స అందించినట్లు ఆస్పత్రి చీఫ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు.
దీంతో పాప ఊపిరి తిత్తులు విచ్చుకోవడానికి మందులు ఇచ్చేందుకు వీలు పడిందన్నారు. 28వ రోజున చిన్నారికి యూ ఏ పీడీఏ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. దీంతో పాప బరు వు 1500 గ్రాములకు చేరుకోవడంతో జూన్ 11 డిశ్చార్జీ చేసినట్లు డాక్ట ర్ సుదీప్ వర్మ తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ గౌతమి, డాక్టర్ సుదీప్, అనస్తటిస్ట్ డాక్టర్ నాగరాజన్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment