premature baby
-
చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్లు! అది ప్రీమెచ్యుర్ చిన్నారుల్లోనే ఎక్కువ ఎందుకు?
ఇటీవల చిన్నారుల్లో బ్రెయిన్ ట్యూమర్ల (మెదడులో గడ్డల) కేసులు చాలా ఎక్కువగా వస్తుండటం అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులు... ఇలా అన్ని వర్గాల్లోనూ బెంబేలు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుండటం వైద్యవర్గాల్లో ఆందోళన పెంచుతోంది. మామూలుగానైతే బిడ్డ తన తల్లి కడుపులో 37 వారాలు పెరగాలి. తల్లి కడుపులో అంతకంటే తక్కువగా ఉన్న పిల్లల్లో కొన్ని శారీరక వ్యవస్థలు పూర్తిగా ఎదగకుండాపోయే ప్రమాదముంటుంది. ఇలాంటి చిన్నారుల్లోనే మెదడు గడ్డలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయనే అంశంపై వైద్యవర్గాలు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్న ఈ తరుణంలో... చిన్నారుల్లో మెదడు గడ్డల సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. చిన్నారులు తమ తల్లి కడుపులో ఉండాల్సిన వ్యవధి కన్నా తక్కువ కాలం ఉండటం వల్ల... ప్రీ–మెచ్యుర్ బేబీస్‌లో కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవచ్చు. మిగతా అవయవాల సంగతి ఎలా ఉన్నా, అన్ని అవయవాల్లోకెల్లా మెదడు ఎదుగుదల చాలా కీలకం. కాబట్టి అదొక్కటి ఎదగకపోవడం వల్ల చాలా వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశముంటుంది. ప్రీమెచ్యుర్ బేబీస్కీ, అవయవాల పెరుగుదల లోపాలకీ సంబంధమేమిటంటే... కడుపులో పూర్తికాలం లేకపోవడం వల్ల మెదడు సహా, కొన్ని అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం ఒక ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)కాగా... మెదడులో గడ్డలు రావడం, క్రమేణా అవి పెరగడం, దాంతో... కొన్ని వ్యవస్థలను నియంత్రించే సెంటర్లను ఆ పెరిగే గడ్డలు నొక్కేయడంతో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. కడుపులో పూర్తిగా ఎదిగిన బిడ్డలతో పోలిస్తే... ప్రీ–టర్మ్ చిన్నారుల్లో ఈ ముప్పు పెరిగేందుకు ఈ అంశాలు దొహదపడతాయి. దానికి తోడు జన్యుపరమైన సమస్యలతో పుట్టుకతోనే (కంజెనిటల్గా) వచ్చే ఆరోగ్య సమస్యలూ, పర్యావరణ కారణాలతో వచ్చే ఆరోగ్యలోపాలూ... ఇవన్నీ కలిసి ప్రీ–మెచ్యుర్ బేబీల రిస్క్‌ను మరింతగా పెంచేస్తాయి. లక్షణాలు మెదడులో గడ్డలున్న పిల్లల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అవి... ఎంతకూ తగ్గని తలనొప్పి... ఇది నిరంతరమూ చిన్నారులను వేధిస్తుంటుంది. కారణం తెలియకుండా కనిపించే వాంతులు ∙పిల్లల ప్రవర్తనలో తేడాలు, మెదడులో గడ్డలు ప్రభావితం చేసే చోటు (సెంటర్)ను బట్టి కొన్నిసార్లు పిల్లలు వింతగా ప్రవర్తించవచ్చు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో కారణం వెంటనే తెలియకపోవచ్చు. చిన్నారుల ఎదుగుదల ఆలస్యం కావడం (డెవలప్మెంటల్ డిలే) సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడమెలా... పిల్లలు తమ సమస్యను పెద్దవారిలా చెప్పలేరు. పైగా మెదడులో గడ్డలు ఉన్నప్పుడు పిల్లల్లో కనిపించే లక్షణాలు కూడా మామూలు పిల్లల్లోనూ ఏదో ఒక సమయంలో కనిపించేవే. ఈ అంశం కూడా సమస్యను గుర్తించడం, త్వరగా నిర్ధారణ చేయడంలో సమస్యగా మారుతుంది. ఇక నిర్ధారణ కోసం లక్షణాలను బట్టి ఈఈజీ, అల్ట్రాసౌండ్ లేదా ఎమ్మారై స్కాన్‌లాంటి మెదడు స్కానింగ్ ప్రక్రియలతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. చిన్నారుల్లోని మెదడులో గడ్డలు ఉన్నట్లుగా ఎంత త్వరగా గుర్తిస్తే... చికిత్సకు అంతగా మేలు చేస్తుంది. నిజానికి ఈ అంశమే చికిత్సలో చాలా కీలకం. అందుకే తల్లిదండ్రులు మాత్రమే కాకుండా... పిల్లల స్కూలు టీచర్లు, ఇతరత్రా వారికి సేవలందించేవారు, సహాయకులు (కేర్ గివర్స్), డాక్టర్ల వంటి హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ అందరూ చిన్నారుల మెదడులో గడ్డలున్నప్పుడు కనిపించే లక్షణాలు, ఇతరత్రా అంశాలూ, సవాళ్లపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎన్నో కొత్త పరిశోధనలు ఇటీవల మెదడులో వచ్చే రకరకాల గడ్డలు... అందునా మరీ ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారుల్లో వచ్చే మెదడు గడ్డల విషయంలో చాలా కీలకమైన పరిశోధనలు జరుగుతున్నాయి. మరిన్ని అధునాతన పరిశోధన ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మెదడు సర్జరీల్లో ‘న్యూరోనావిగేషన్’, ‘న్యూరోమానిటరింగ్), అలాగే కోత తక్కువగా ఉండే విధానాలు. ఈ పద్ధతుల్లో చేసే శస్త్రచికిత్సలో మెదడులోని అత్యంత సంక్లిష్టమైన భాగాలను 3–డీ ఇమేజ్‌లో గడ్డ నిర్దిష్టంగా ఎక్కడ ఉందో చూస్తూ, సర్జన్ సరిగ్గా అక్కడికే చేరడానికి వీలవుతుంది. తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి బాగా తగ్గడంతో పాటు, కోత కూడా తక్కువ కావడంతో బాధితులైన చిన్నారులు చాలా త్వరగా కోలుకుంటారు. మెదడులోని అత్యంత సున్నితమైన భాగాలకు చేరే సమయాల్లో కలిగే రిస్క్‌లను అంచనా వేసి, మిగతా భాగాలకు ఎలాంటి విఘాతం లేకుండా గడ్డ ఉన్న చోటికి చేరడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక సునిశిత పరికరాలు బాగా తోడ్పడతాయి. అందువల్ల గతంతో పోలిస్తే ఇప్పుడీ సమస్య పట్ల అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. చికిత్స ఒకసారి సమస్య నిర్ధారణ జరిగాక చికిత్స అన్నది కేవలం ఒక స్పెషలిస్టు డాక్టరుతో కాకుండా అనేక రకాలుగా (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) జరగాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటు మెదడులో గడ్డ ఉన్న ప్రాంతాన్ని బట్టి... కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలూ అవసరమవుతాయి. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే... మెదడులో గడ్డ ఎలాంటి ప్రాంతంలో ఉంది, దానికి శస్త్రచికిత్స చేసే సమయంలో ఏయే వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది...లాంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సునిశితమైన, అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్ స్పెషలిస్టుల ఆధ్వర్యంలో చికిత్స జరగాల్సి రావచ్చు. అందుకే ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకూ... ఈ సమస్యలపై ప్రత్యేక అవగాహన ఉండటం చాలా అవసరం. --డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్ (చదవండి: గురకతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ఎన్నో? ఒక్కోసారి మరణానికి దాతీయొచ్చు!) -
దేవుడా! మాకే ఎందుకు ఇలా జరుగుతోంది!!
పుట్టబోయే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది ఏ జంట అయినా. ముద్దులొలికే పసిపాప బోసి నవ్వుల కోసం కలలు కంటుంది. అయితే శ్రీలక్ష్మి, షణ్ముగం దంపతులు మాత్రం తీరని వ్యధలో కూరుకుపోయారు. ఊహించని కారణాలతో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ ప్రమాదంలో పడిపోవడం వారికి కలచివేస్తోంది. చుట్టూ వైర్లతో, అతిసుకుమారమైన బిడ్డ ఒంటిపై సూదులతో ఆసుపత్రిలో బెడ్‌పై దయనీయ పరిస్థితిలో ఉన్న పసిబిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నారు. ఏం జరిగిందంటే.. భార్య శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో షణ్ముగం చాలా హ్యాపీ ఫీలయ్యాడు. అయితే ఉన్నట్టుండి శ్రీలక్ష్మి కాలు వాచిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన షణ్ముగం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. శ్రీలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేయకపోతే తల్లి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని సూచించారు. అలా నెలలు నిండకుండానే 25 వారాలకు బాబు పుట్టాడు. అదీ చాలా బలహీనంగా. నవజాత శిశువు త్వరగా కోలుకునేందుకు ఎన్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర మందులు, ఇతర సప్లిమెంట్లను ఇస్తున్నారు. అయినా ఇంకొన్ని రోజులు పాటు మెరుగైన వైద్యం అందిస్తే తప్ప బాబుకు ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ చికిత్సను కొనసాగించడానికి అయ్యే ఖర్చు రూ. 8 లక్షలు ($ 10014.90). దీంతో శ్రీలక్ష్మి షణ్ముగం జంట ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే షణ్ముగం డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు పోలియోతో దివ్యాంగురాలైన శ్రీలక్ష్మి ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తోంది. వీరికొచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఉన్నదంతా ఇప్పటికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వెచ్చించారు. ఇపుడు 8 లక్షలన్నమాటే వారికి పెద్ద ఆటంబాంబులా వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులు కొంత సాయం చేసినప్పటికీ, ఫలితం లేదు. తమను ఆదుకునే వారే లేరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆవేదన చెందుతున్నారు. దయగల దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను రక్షించాలని కోరుతున్నారు. తగిన సహాయం అందుతుందనే ఆశతో వారు రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. దయచేసి విరాళం అందించండి!! తమ నవజాత శిశువును కాపాడండి అని వేడుకుంటున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆ పాప ఆరు నెలలకే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది.. అదీ కేవలం 600 గ్రాముల బరువుతో! పుట్టగానే కదలిక లేదు. దాదాపు ఆశలు వదులుకున్న శిశువుకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నారు సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రి వైద్యులు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 111 రోజులపాటు చికిత్స అందిస్తూ శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలిగారు. ప్రస్తుతం ఈ శిశువు బరువు 1.30 కిలోలకు పెరిగి ఆరోగ్యం మెరుగుపడింది. ప్రైవేటు ఆస్పత్రి వైద్యులే చేతులెత్తేస్తే.. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ప్రతిష్టాత్మకంగా చికిత్స అందించి శిశువును కాపాడారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఆ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అభినందించారు. పాప తల్లిదండ్రులను పలకరించి ధైర్యం చెప్పారు. నిలోఫర్ వైద్యులూ కష్టమేనన్నారు.. సంగారెడ్డి పట్టణానికి చెందిన అరుంధతి గర్భం దాల్చిన ఆరు నెలలకే ఉమ్మనీరు బయటకు వచ్చింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. తక్షణం ఆపరేషన్ చేయాలని నిర్ణయించిన వైద్యులు సిజేరియన్ చేసి పాపను బయటకు తీశారు. ఆరు నెలలకే పుట్టడంతో పరిపక్వత లేని అవయవాలతో ఉన్న శిశువుకు ఊపిరి పీల్చడమే ఇబ్బందిగా ఉంది. బతకడం కష్టమని వైద్యులు తేల్చేయడంతో తల్లీబిడ్డను సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్రిటికల్ కేసు కావడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో అక్కడికి తరలించి చికిత్స చేయించగా పాప బతకడం కష్టమని అక్కడి వైద్యులు తేల్చిచెప్పారు. అప్పుడప్పుడు కాళ్లు, చేతులు మాత్రమే ఆడిస్తున్న పాపను తిరిగి తల్లి చికిత్స పొందుతున్న సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డా.అశోక్, డా.షబ్బీర్, డా.శశికళ, డా.సతీశ్‌లతో కూడిన చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణుల బృందం పాపను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందించారు. తీవ్ర రక్తహీనతతో ఉండటంతో శిశువుకు ఆరుసార్లు రక్తం ఎక్కించారు. శిశువు అవయవాలు అపరిపక్వతతో ఉండటంతో ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడింది. ఫిట్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్న ఈ శిశువుకు ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బరువు పెరిగేందుకు స్పెషల్ న్యూట్రిషిన్ సప్లిమెంటరీలు ఇచ్చారు. 111 రోజుల తర్వాత శిశువు ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం 1.30 కిలోలకు చేరిన శిశువుతోపాటు, తల్లిని కూడా కొద్దిరోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని వైద్యులు భావిస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ కేసు ఈ మధ్యకాలంలో జిల్లాలో మొదటిసారని డా.సతీష్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. మెరుగైన చికిత్స అందించిన వైద్యులకు, వైద్య సిబ్బందికి తల్లి అరుంధతి కృతజ్ఞతలు తెలిపారు. -
710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్‌ఐసీయూలోనే
సాక్షి, హైదరాబాద్: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్‌నగర్ ఈఎస్ఐసీ పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌కు చెందిన వినోద్‌కుమార్ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు. పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. సనత్‌నగర్ ఈఎస్ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్‌కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు. -
చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. నటి ఎమోషనల్ పోస్ట్
Dia Mirza Emotional Post About Her Son Premature Birth: 2021 సంవత్సరం వెళ్లిపోయి న్యూ ఇయర్ 2022 రాబోతుంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు ఈ ఏడాది తమ జీవితంలో ఏర్పడిన విశేషాలు, కలిగిన కష్టాలు, బాధలను పంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జా శుక్రవారం (డిసెంబర్ 31)న 2021లోని మధురమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను తల్లిగా మార్చిన ఈ ఇయర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేసింది దియా. ఈ ఏడాది అంతులేని ఆనందాన్ని పొందానని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లో 'ఈ సంవత్సరం చావు అంచుల వరకు వెళ్లినా కూడా అంతులేని ఆనందాన్ని పొందాను. నా కొడుకు నెలలను నిండక ముందే పుట్టి కొన్ని పరీక్షలు పెట్టాడు. కానీ పాఠాలు నేర్చుకున్నాను. గొప్ప పాఠం. కష్టతరమైన కాలాన్ని అనుభవించా.' అని రాసుకొచ్చింది. అయితే దియా కుమారుడు అవ్యాన్ ఆజాద్ రేఖీ అత్యవసర పరిస్థుతుల వల్ల నెలలు నిండకముందే జన్మించాడు. మే 15న నియోనాటల్ ఐసీయూలో సీ-సెక్షన్ ద్వారా అవ్యాన్‌కు జన్మనిచ్చింది దియా. అనంతరం వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. 'నా గర్భధారణ సమయంలో ఆకస్మిక అపెండెక్టమీ తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు దారి తీసింది. అది చాలా ప్రమాదకరమైనది అని వైద్యులు తెలిపారు. వైద్యుల సకాలంలో స్పందించడంతో నా కొడుకుకు సురక్షితంగా జన్మనివ్వగలిగాను.' అని 40 ఏళ్ల దియా జూలైలో తెలిపింది. View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) ఇదీ చదవండి: ఆటో రిక్షా నడిపిన సల్మాన్ ఖాన్.. నెటిజన్ల ట్రోలింగ్.. -
‘నా బిడ్డ ప్రాణం కాపాడండి’
బెంగళూరు సమీప గ్రామానికి చెందిన కృష్ణప్ప నేత పనిచేసేవాడు. నెలకు రూ. 6000ను సంపాదించే కృష్ణప్పకు, గౌరమ్మతో వివాహం జరిగింది. వీరికి వివాహమై ఏడాది కావస్తుంది. కృష్ణప్ప భార్య గర్భం దాల్చడంతో ఇరువురు సంతోషంతో మునిగిపోయారు. డిసెంబర్ మొదటి వారంలో మా ఇంట్లోకి మరో వ్యక్తి వస్తారానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. దురదృష్టవశాత్తూ గౌరమ్మ నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ నవజాత శిశువు సుమారు 3.5 కేజీల బరువు ఉంటారు. 30 వారాలలోపే గౌరమ్మ బిడ్డకు జన్మనివ్వడంతో శిశువు కేవలం 1.2 కిలోల బరువుతో పుట్టాడు. ఇప్పడు అదే శిశువు ప్రాణాలమీదకు వచ్చింది. ఆ బిడ్డను కాపాడేందుకు దంపతులు చేయరాని ప్రయత్నాలను చేస్తున్నారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలనే ఆశతో వైద్యులను కలిశారు. వైద్యులు బిడ్డను కాపాడుకోవాలంటే 30 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించారు. శిశువు వైద్యం కోసం గౌరమ్మ, కృష్ణప్ప దంపతులు ఇప్పటివరకు రూ.2 లక్షల వరకు అప్పుచేయాల్సి వచ్చింది. కొన్ని రోజులపాటు ఆసుపత్రితో ఉంటే మా బిడ్డను రక్షించుకోవచ్చునని వైద్యులు అన్నారు. అందుకుగాను వైద్యం కోసం ఇంకా రూ. 5 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. మా బిడ్డను రక్షించడం కోసం మీ తోచినంతా సహాయం చేయగలరని ఆశిస్తున్నాము. (అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా?
నాకు పెళ్లయి మూడేళ్లయింది. నా వయసు 29 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 48 కిలోలు. గత ఏడాది నాకు తొలికాన్పు ఏడోనెలలోనే జరిగింది. పుట్టిన పది రోజులకే పాప పోయింది. ఇప్పుడు నాకు నాలుగో నెల. తొలికాన్పులో తలెత్తిన పరిస్థితి మళ్లీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – సుమతి, టెక్కలి సాధారణంగా గర్భస్థ శిశువు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక వారం వరకు పెరుగుతుంది. సక్రమంగా పీరియడ్స్ వచ్చేవారిలో చివరి పీరియడ్ అయిన మొదటి రోజు నుంచి లెక్కపెడితే, 280 రోజులు లేదా 40 వారాల సమయానికి డెలివరీ తేదీని (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ–ఈడీడీ) నిర్ణయించడం జరుగుతుంది. దాదాపు 80 శాతం మందికి ఈడీడీ కంటే రెండు వారాల ముందే డెలివరీ జరుగుతుంది. కాన్పు నొప్పులు ఎవరికి ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. 36 వారాలకు ముందే కాన్పు కావడాన్ని ప్రీటెర్మ్ డెలివరీ అంటారు. సాధారణంగా 36–37 వారాల వరకు బిడ్డ ఊపిరితిత్తుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడుతుంది. ఇంకా ముందే పుట్టడం వల్ల బిడ్డ ఊపిరితిత్తులు సరిగా ఎదగక బిడ్డ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు ఏర్పడి, సమయానికి సరైన వైద్య సహాయం అందకపోయినా, బిడ్డ చికిత్సకు సరిగా స్పందించకపోయినా బిడ్డకు ప్రాణాపాయం కలగవచ్చు. మీ పాప మరీ ఏడో నెలలోనే పుట్టడం వల్ల ఇబ్బంది అయినట్లుంది. గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ చిన్నగా ఉన్నా, లూజ్‌గా ఉన్నా కొందరిలో బిడ్డ బరువు పెరిగే కొద్ది గర్భాశయం వదులై, నెలలు నిండకుండానే కాన్పు జరగవచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతరేతరా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, గర్భాశయం ఆకారంలో తేడాలు ఉంటే బైకార్నుయేట్ యుటెరస్, సెప్టేట్ యుటెరస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కొందరిలో 7–8 నెలలో కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదవండి: ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!! ఇప్పుడు మీకు నాలుగో నెల గర్భం కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో నెలలు నిండకుండా డెలివరీ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కానింగ్‌లో గర్భాశయ ముఖద్వారం– అంటే సర్విక్స్ లెంగ్త్ తెలుసుకుంటూ ఉండటం ముఖ్యం. ఒకవేళ సర్విక్స్ లూజ్‌గా ఉన్నా, చిన్నగా ఉన్నా గర్భాశయ ముఖద్వారానికి యోనిభాగం ద్వారా సర్‌క్లాజ్ కుట్లు వేయడం జరుగుతుంది. వజైనల్ ఇన్ఫెక్షన్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ, వాటికి సరైన చికిత్స తీసుకోవడం, అలాగే గర్భాశయ కండరాలు కుంచించుకోకుండా ఉండటానికి ప్రొజెస్టిరాన్ ఇంజెక్షన్లు, మాత్రలు అవసరాన్ని బట్టి వాడటం, శారీరక శ్రమ లేకుండా విశ్రాంతిగా ఉండటం వంటి జాగ్రత్తలు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ ఉండటం వల్ల చాలా వరకు నెలలు నిండకుండా జరిగే కాన్పులను అరికట్టవచ్చు. కాని, కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గర్భాశయం పనితీరు, శరీరం తీరును బట్టి కొందరిలో ముందుగానే కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు బిడ్డలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి 7–8 నెలలో స్టిరాయిడ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ సలహాను పాటిస్తూ, సరైన జాగ్రత్తలు తీసుకుంటూ, అన్ని సౌకర్యాలూ ఉన్న ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంటూ ఉంటే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఒకవేళ ముందుగా పుట్టినా, సమయానికి ఇంక్యుబేటర్‌లో ఉంచి, సరైన చికిత్స ఇవ్వడం వల్ల, బిడ్డ చికిత్సకు స్పందించే తీరు బట్టి బిడ్డ ఆరోగ్యంగా బయటపడుతుంది. నేను థైరాయిడ్, పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్నాను. నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. నా ఎత్తు 5.1, బరువు 75 కిలోలు. ఇంట్లోవాళ్లు త్వరలోనే నాకు పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. థైరాయిడ్, పీసీఓడీ రెండు సమస్యలూ ఉంటే పిల్లలు పుట్టరని విన్నాను. నిజమేనా? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – సాయిలక్ష్మి, ధర్మవరం థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు తలెత్తినప్పుడు కొందరిలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, సక్రమంగా వచ్చినా, కొందరిలో అండం సరిగా పెరగకపోవడం, అది విడుదల కాకపోవడం వంటి సమస్యల వల్ల గర్భం రాకపోవడం, గర్భం వచ్చినా, అబార్షన్ జరగడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాకపోతే ఈ సమస్యలకు గైనకాలజిస్టులు చెప్పిన సలహాలను పాటిస్తూ, సరైన చికిత్స తీసుకుంటే, థైరాయిడ్ సమస్య అదుపులో ఉండి, పీసీఓడీ వల్ల ఉండే హార్మోన్ల అసమతుల్యత చక్కబడితే గర్భం తప్పకుండా వస్తుంది. ఇక మీ విషయానికి వస్తే, ఎత్తు 5.1 అడుగులకు గరిష్ఠంగా 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కాని, మీరు 75 కిలోలు ఉన్నారు. మీ సమస్యలకు సగం చికిత్స బరువు తగ్గడమే! క్రమం తప్పకుండా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలతో పాటు జంక్‌ఫుడ్ మానేసి, మితమైన పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది. మీరు పెళ్లి కుదిరే లోపు బరువు తగ్గి, థైరాయిడ్ మాత్రలు సరైన మోతాదులో తీసుకుంటూ, థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకుంటే, పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు సహజంగానే పెరుగుతాయి. బరువు తగ్గితే పెళ్లయిన తర్వాత గర్భం రాకపోయినా, సరైన చికిత్సతో గర్భం త్వరగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గకుండానైతే, గర్భం కోసం చికిత్సలో భాగంగా ఎక్కువ కాలం ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే బరువు తగ్గడానికి పైన చెప్పిన జాగ్రత్తలు పాటించడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో.. -
ప్రపంచంలోనే అత్యంత ప్రీమెచ్యూర్ బేబిగా గిన్నిస్ రికార్డ్
న్యూయార్క్: నిజానికి నెలలు నిండకుండా పుట్టే పిల్లలు బ్రతికి ఉండడం అత్యంత అరుదు. ఒకవేళ బతికినా జీవితాంతం ఏవో అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. కానీ ఇప్పటి వరకు నెలలు తక్కువగా పుట్టడం అంటే మహా అయితే డెలివరీ తేదికి కాస్త ఒక నెల ముందుగా లేదా ఒక నెల రెండు వారాలు అటు ఇటుగా పట్టడం జరుగుతుంది. కానీ అలా ఇలా కాకుండా కేవలం 21 వారాలు 1 రోజుతో జన్మించి ఆరోగ్యంగా బ్రతికి బట్టగలిగాడు యూఎస్‌కి చెందిన కర్టిస్ అనే చిన్నారి. (చదవండి: ఇదో కొత్తరకం కేఫ్... ఇంత వరకు ఎవ్వరూ చూసుండరు!) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లోని అలబామాకు చెందిన కర్టిస్ జై-కీత్ మీన్స్ అనే చిన్నారి జూలై 2020లో 21 వారాలు 1 రోజుతో జన్మించి ప్రపంచలోని అత్యంత నెలలు నిండని శిశువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఆ చిన్నారి తల్లి మిచెల్ చెల్లీ బట్లర్‌కి మొదట గర్భం బాగానే ఉంది. అయితే ఒకరోజు అనుకోకుండా ఆమె ఆరోగ్యంలో చిన సమస్య తలెత్తడంతో అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం గతేడాది జూలై 4న ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను స్థానిక ఆసుపత్రి నుండి బర్మింగ్‌హామ్ (యూఏబీ)లోని అలబామా విశ్వవిద్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఆమెకు అబార్షన్ చేయాలని నిర్ణయించారు. అయితే ఆమె పట్టబట్టడంతో డెలివీరీ తేదికి 19 వారాలు ముందుగా అంటే 21 వారాల 1 రోజు (148 రోజులు) గర్భధారణతో జూలై 5న మధ్యాహ్నాం 1 గంటకు కర్టిస్ జన్మించాడు. అయితే వైద్య సిబ్బంది ఆ వయసు పిల్లలు బతకడం కష్టం అని తేల్చి చెప్పేశారు. కానీ ఆశ్చర్యంగా కర్టిస్ చికత్సకు స్పందించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ వైద్యులు ఇలా బతకట కష్టం ఈ విధంగా చికిత్స అందించటం చాలా ఒత్తిడితో కూడిని పని అని చెప్పారు. ఈ మేరకు యూఏబీ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రియాన్ సిమ్స్ మాట్లాడుతూ, "ఈ వయస్సులో ఉన్న పిల్లలు బతకలేరనే చాలా కేసులు చెబుతున్నాయి. కానీ ఈ తల్లి ఆశ నెరవేరుతుందో లేదో అనుకున్నాను. పైగా ఇంత నెలల తక్కువ బిడ్డను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్‌కి తరలించడం కష్టమని గ్రహించాం. దీంతో ఆ బిడ్డ ఉన్న ప్రదేశం నుంచే చికిత్స అందించాం. అయితే ఆ చిన్నారి ఆక్సిజన్‌కి స్పందించడం హృదయస్పందన రేటు పెరగడం జరిగింది. అంతేకాతు ఆ చిన్నారికి మూడు నెలల వయసు వచ్చే వరకు వెంటిలేటర్ మీద చికిత్స అందించాం" అని అన్నారు. ఆ తర్వాత ప్రాంతీయ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఆర్ఎన్ఐసీయూ)లో 275 రోజులు గడిపిన తదనంతర చిన్నారి కర్టిస్ ఈ ఏడాది ఏప్రిల్ 6న ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఈ మేరకు నియోనాటాలజీ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ కోల్మ్ ట్రావర్స్ చిన్నారి కర్టిస్ 21 వారాల 1-రోజు గర్భధారణ వయస్సులో జన్మించివాడిగా ప్రపంచ రికార్డును నెలకొల్పి ఉండవచ్చన్న అనుమానంతో చిన్నారి తల్లి మిచెల్‌తో గిన్నిస్ రికార్డుకి దరఖాస్తు చేయించారు. అంతేకాదు గిన్నిస్ రికార్డు కూడా ప్రపంచంలోనే అత్యంత నెలలు నిండకుండా జన్మించిన అరుదైన చిన్నారిగా ప్రకటించటం విశేషం. (చదవండి: ఐస్‌క్రీం కొనడానికి వచ్చి ఏం చేశాడో తెలుసా... నవ్వాగదు! -
28 వారాలకే జన్మించిన శిశువు.. అరుదైన చికిత్స
సాక్షి, గచ్చిబౌలి: నెలలు నిండక ముందే జన్మించిన (28 వారాలు) ఆడ శిశువు గుండెకు కొండాపూర్ కిమ్స్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. చందానగర్‌కు చెందిన అనిత, రాకేష్ సింగ్ దంపతులకు గత ఏప్రిల్ 21న ఆడపిల్ల జన్మించింది. సాధారణంగా నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జని్మంచిన శిశువు (1100 గ్రాముల బరువు) బతికే అవకాశాలు తక్కువ. పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ సమస్య ఉండటంతో రెండు ప్రధాన రక్త నాళాల మధ్య ఖాళీ ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు చికిత్స అందించినట్లు ఆస్పత్రి చీఫ్ నియోనెటాలజిస్ట్ డాక్టర్ అపర్ణ తెలిపారు. దీంతో పాప ఊపిరి తిత్తులు విచ్చుకోవడానికి మందులు ఇచ్చేందుకు వీలు పడిందన్నారు. 28వ రోజున చిన్నారికి యూ ఏ పీడీఏ పరికరాన్ని అమర్చినట్లు తెలిపారు. దీంతో పాప బరు వు 1500 గ్రాములకు చేరుకోవడంతో జూన్ 11 డిశ్చార్జీ చేసినట్లు డాక్ట ర్ సుదీప్ వర్మ తెలిపారు. కార్యక్రమంలో పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ గౌతమి, డాక్టర్ సుదీప్, అనస్తటిస్ట్ డాక్టర్ నాగరాజన్, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కొరడా ఝుళిపించిన కలెక్టర్.. డీపీఆర్‌ఓపై చర్యలు -
Guinness World Record: బతికే ఛాన్స్ జీరో.. బర్త్ డే వేడుకలు..
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత తక్కువ రోజులకే భూమిపైకి వచ్చిన ఓ బుడతడు తన మొదటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. అమెరికాకు చెందిన బెత్, రిక్ దంపతులకు 2020, జూన్ 5న రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ జన్మించాడు. అయితే రిచర్డ్ బతికే ఛాన్స్ జీరో అని అప్పట్లో డాక్టర్లు తేల్చేశారు. కానీ తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణలో రిచర్డ్ తన ఫస్ట్ బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. 21 వారాల 2 రోజులకు జన్నించి బతికిన శిశువుగా రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు నిజానికి బెత్ హచిన్సన్ డెలివరీ డేట్ 2020 అక్టోబర్ 13. అయితే కొన్ని సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. దీనిపై వైద్యులు బెత్ హచిన్సన్ భర్త రిక్ హచిన్సన్తో తీవ్రమైన చర్చలు జరిపిన తరువాత బిడ్డను బయటకు తీశారు. రిచర్డ్ స్కాట్ జన్మించినపుడు కేవలం 340 గ్రాముల బరువు.. 26 సెంటీ మీటర్ల పొడవు.. ఓ అరచేతిలో సరిపోయే సైజు మాత్రమే ఉన్నాడు. ఇక అతడి బరువు పూర్తికాల నవజాత శిశువు సగటు బరువులో పదోవంతు అన్నమాట. బతకడం జీరో ఛాన్స్ అన్న డాక్టర్ రిచర్డ్ స్కాట్ విలియం హచిన్సన్ పుట్టినప్పుడు అతడు బతకడం జీరో ఛాన్స్ అని మిన్నియాపాలిస్‌లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా ఆసుపత్రిలోని డాక్టర్ నియోనాటాలజిస్ట్ స్టేసీ కెర్న్ అభిప్రాయపడ్డారు. సాధారణంగా ఓ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటలకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని తెలిపారు. ఇక గతంలో కెనడాలోని ఒట్టావాలో బ్రెండా, జేమ్స్ గిల్ దంపతులకు 1987, మే 20న జన్మించిన జేమ్స్ ఎల్గిన్ గిల్ పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉండేది. జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల 5 రోజులు మాత్రమే ఉన్నాడు. చదవండి: విషాదం: ప్రపంచ రికార్డ్ కోసం ఫీట్.. ప్రాణాలు గాల్లో.. -
‘అమ్మ’ను గెలిపించిన మెడికవర్ వైద్యులు
సాక్షి, సిటీబ్యూరో: పుట్టుకతోనే తక్కువ బరువు (550 గ్రాములు)తో జన్మించి..మృత్యువుతో పోరాడుతున్న ఓ శిశువుకు మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 140 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడారు. ప్రస్తుతం శిశువు బరువు 2.5 కేజీలకు చేరుకోవడంతో శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు చికిత్స సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. నెలలు నిండక ముందే సిజేరియన్ ద్వారా ప్రసవం.. నగరానికి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ గతేడాది నవంబర్ ఆరో తేదీన తొలి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయాల్సి వచ్చింది. 24 వారాల ఐదు రోజులకు శిశువు జన్మించింది. ఈ సమయంలో శిశువు బరువు కేవలం 550 గ్రాములే. సాధారణంగా ఇంత తక్కువ బరువుతో జన్మించిన శిశువులు బతకడం చాలా కష్టం. కానీ మెడికవర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె, డాక్టర్ నవిత, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ జనార్దన్‌రెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ రాకేష్‌ల నేతృత్వంలోని వైద్య బృందం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును ఎలాగైనా బతికించాలని భావించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత ఎన్ఐసీయూకు తరలించి సీపీఏపీతో శ్వాసను అందించారు. పుట్టిన రెండో రోజు నుంచే శిశువుకు ఐవీప్లూయిడ్స్, యాంటీబయాటిక్స్, ట్యూబ్ ద్వారా పాలు అందించారు. ఇదే సమయంలో శిశువుకు జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్ వచ్చింది. ఫీడింగ్ ఆపేసి..యాంటిబయా టిక్ డోస్‌ను పెంచారు. శిశువు కోలుకున్న తర్వాత నేరుగా పాలు పట్టడంతో పాటు సీపీఏపీ ప్రక్రియను నిలిపివేసి, స్వయంగా శ్వాసతీసుకునే విధంగా చేశారు. ప్రస్తుతం శిశువు 2.5 కేజీల బరువు పెరిగింది. శ్వాస తీసుకోవడంతో పాటు స్వయంగా పాలు తాగుతుంది. గతంతో పోలిస్తే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. దీంతో శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. చికిత్సకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు అయినట్లు ఆస్పత్రి వర్గాల తెలిపాయి. -
మరో ఆరు వారాల పాటు ఐసీయూలోనే చిన్నారి
పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 11 ఏళ్ల తర్వాత జయలక్ష్మీ-ప్రకాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న అనుభూతి కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. వారు తమ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి ఎదురైంది. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో పుట్టగానే ఇంక్యుబేటర్‌కే పరిమితం అయ్యాడు. దీనికి తోడు శ్వాససంబంధిత సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఏడవనెలలో ఉండగానే ఆరోగ్యం క్షీణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు అత్యవసరంగా డెలివరీ చేయాల్సి వచ్చింది. అప్పటికీ బిడ్డ బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే. ప్రీమెచ్యూరిటీతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు అప్పుడే నిర్ధారణ అయింది. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి బాబు చిన్న పెట్టెలో ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. అతని శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూనే ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం దాదాపు 78 లక్షల 40 వేలు అవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ప్రకాష్ ఓ ఆఫీసులో అటెండర్‌గా పనిచేసేవాడు. సంతానోత్పత్తి చికిత్స కోసం చాలా మేం దాచుకున్న డబ్బుల్లో చాలావరకు ఖర్చయ్యాయి. ఇప్పటికే ప్రకాష్ అప్పుల్లో కూరుకుపోయాడు. దీనికి తోడు కొన్ని కారణాల వల్ల ఆయన ఉద్యోగం కూడా పోయింది. 11ఏళ్లు చూసిన ఎదురుచూపులకి మా బిడ్డ ఈ లోకాలనికి వచ్చి మా జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా బిడ్డను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
నెలలు నిండని శిశువును కాపాడిన కిమ్స్ వైద్యులు
సాక్షి, కర్నూలు : నెలలు నిండకుండానే పుట్టిన శిశువును అతికష్టం మీద శస్ర్తచికిత్స చేసి కాపాడారు కిమ్స్ వైద్యులు. కేవలం 950 గ్రాముల అతి తక్కువ బరువు ఉండటంతో పాటు పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఉండటంతో శిశువును కాపాడటం వైద్యులకు కత్తిమీద సాములా మారింది. అయినప్పటికీ శిశువు ప్రాణాలు కాపాడి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన అరుదైన ఘటన కిమ్స్ ఆసుపత్రి వైద్యులకే దక్కింది. కడప జిల్లాకు చెందిన గీత అనే మహిళ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో రెండోసారి గర్భం దాల్చారు. అయితే ఆరున్నర నెలలకే ఉమ్మనీరు మొత్తం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. అయితే శిశువు రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండటంతో పాటు ప్తేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ( నెక్రోటైజింగ్ ఎంటెరోకొలైటిస్ ) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు ప్లేగులకు రంధ్రం కూడా ఉన్నట్లు పరీక్షలో వెల్లడైంది. దీంతో పీడియాట్రిక్ నిపుణులైన డా. శ్రీకాంత్ బాబు సంరక్షణలో శిశువును ఐసీయూలో పెట్టి అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వ్యవస్థలపై ఉంచారు. ఇలియోస్టమీ (మలవిసర్జనకు ప్రత్యేక మార్గం ) ఏర్పాటు చేసి శిశువును కొన్ని రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి క్రమంగా తీసేశారు. అతి చిన్న వయసులోనే శిశువుకు ఇన్ఫెక్షన్ రావడంతో 3 వారాలపాటు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. దాంతో పాటు రెండుసార్లు రక్తం ఎక్కించి 5సార్లు ప్లేట్లెట్లు ఎక్కించారు. తర్వాత కొద్దికొద్దిగా తల్లిపాలు అలవాటు చేసి కంగారూ మదర్ కేర్ అందించారు. దాదాపు నెల రోజుల అనంతరం వైద్యుల సంరక్షణ అనంతరం ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుంది. ('అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు' ) -
ఐ పాడ్ కన్నా తక్కువ బరువు..
దుబాయ్: నెలలు నిండకుండా పుట్టే శిశువులు బరువు తక్కువగా ఉండటం, వారిని కాపాడటం కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తెలిసిందే. కాగా పుట్టినప్పుడు ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో ఉన్న శిశువు, సుమారు 110 రోజుల ప్రత్యేక చికిత్స అనంతరం 1.9 కేజీల బరువు పెరగడం విశేషంగా నిలిచింది. కిలోకంటే తక్కువగా కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టిన పసికందును దుబాయ్‌లోని వైద్య బృందం కాపాడిన వైనం అద్భుతంగా నిలించింది. ఈ వైద్య బృందంలో ఓ భారతీయ వైద్యుడు కూడా ఉండడం విశేషం. ఇది చాలా అరుదైన ఘటన అంటూ స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. సాధారణంగా 600 గ్రాములపైన బరువుండే ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువు... కోలుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లడం అద్భుతమని పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఫిలిపినా కు చెందిన క్రిస్టోఫర్ శాక్రమెంటో భార్య సూసీ గత అక్టోబర్‌లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 14 వారాల ముందుగానే ప్రసవం జరగడంతో శిశువు, కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టాడు. దీంతో ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వద్ద నాలుగు నెలలపాటు ప్రత్యేక చికిత్స అందించారు. దాదాపు వైద్య బృందం కూడా ఆశలు వదిలేసినప్పటికీ అనూహ్యంగా శిశువు పూర్తిగా కోలుకున్నాడు. అతని బరువు, ఆరోగ్యం సంతృప్తికర స్థాయికి చేరడంతో ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనిపై సూసీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులు తన బిడ్డ నికోలస్‌కు పునర్జన్మను ప్రసాదించారని ఉద్వేగంగా చెప్పారు. -
30వేల అడుగుల ఎత్తులో ప్రసవం
30వేల అడుగుల ఎత్తులో నెలలు నిండని శిశివుకు ఓ తల్లి జన్మనిచ్చింది. ఈ సంఘటన బాలీ నుంచి లాస్ ఏంజెల్స్ ప్రయాణిస్తున్న చైనా ఏయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుంకుంది. దూరప్రయాణం చేస్తున్న తైవాన్‌కు చెందిన మహిళకు డెలివరీ సమయానికన్నా 8 వారాలు ముందుగానే పురిటి నోప్పులు వచ్చాయి. విమానంలో ఉన్న డాక్టర్‌కు సిబ్బంది సమాచారాన్ని అందించారు. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో విమానంలోని డాక్టర్, సిబ్బంది సహాయంతో మహిళకు డెలివరీ చేశారు. ఆ మహిళ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈ డెలివరీ అనంతరం జరిగిన పరిణామాలను ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. డెలివరీ చేసిన సిబ్బంది విమానంలోని దుప్పట్లలోకి ఆ పసికందును సంతోషంగా తీసుకోవండం, టిష్యూ పేపర్లతో ఆ చిన్నారిని, తల్లిని శుభ్రపరిచిన దృశ్యాలు అందులో ఉన్నాయి. ఈ సంఘటనతో విమానాన్ని అత్యవసరంగా అలస్కాలోని టెడ్ స్టీవెన్స్ ఆంకరేజ్ విమానాశ్రయంలో నిలిపి తల్లి, బిడ్డలను ఆంకరేజ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మూడు గంటల ఆలస్యం అనంతరం ఆ విమానం మిగతా ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్ చేరుకుంది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి విమాన సిబ్బంది, ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ప్రయాణాలు చేశాను కానీ ఇలా విమానంలో నేను ప్రయాణిస్తున్న సమయంలోనే శిశివు జన్మించడం మరచిపోలేని సంఘటన అని ఓ ప్రయాణికుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ బిడ్డ విమానంలోనే జన్మించడంతో ఆంకరేజ్ లోని ఆస్పత్రి వర్గాలు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ ఆధారంగానే ఆ పసికందు జాతీయత ఆధారపడనుంది.