పుట్టబోయే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది ఏ జంట అయినా. ముద్దులొలికే పసిపాప బోసి నవ్వుల కోసం కలలు కంటుంది. అయితే శ్రీలక్ష్మి, షణ్ముగం దంపతులు మాత్రం తీరని వ్యధలో కూరుకుపోయారు. ఊహించని కారణాలతో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ ప్రమాదంలో పడిపోవడం వారికి కలచివేస్తోంది. చుట్టూ వైర్లతో, అతిసుకుమారమైన బిడ్డ ఒంటిపై సూదులతో ఆసుపత్రిలో బెడ్‌పై దయనీయ పరిస్థితిలో ఉన్న పసిబిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నారు.
ఏం జరిగిందంటే.. భార్య శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో షణ్ముగం చాలా హ్యాపీ ఫీలయ్యాడు. అయితే ఉన్నట్టుండి శ్రీలక్ష్మి కాలు వాచిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన షణ్ముగం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. శ్రీలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేయకపోతే తల్లి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని సూచించారు. అలా నెలలు నిండకుండానే 25 వారాలకు బాబు పుట్టాడు. అదీ చాలా బలహీనంగా. నవజాత శిశువు త్వరగా కోలుకునేందుకు ఎన్‌ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర మందులు, ఇతర సప్లిమెంట్లను ఇస్తున్నారు. అయినా ఇంకొన్ని రోజులు పాటు మెరుగైన వైద్యం అందిస్తే తప్ప బాబుకు ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ చికిత్సను కొనసాగించడానికి అయ్యే ఖర్చు రూ. 8 లక్షలు ($ 10014.90).
దీంతో శ్రీలక్ష్మి షణ్ముగం జంట ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే షణ్ముగం డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు పోలియోతో దివ్యాంగురాలైన శ్రీలక్ష్మి ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్‌గా పనిచేస్తోంది. వీరికొచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఉన్నదంతా ఇప్పటికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వెచ్చించారు. ఇపుడు 8 లక్షలన్నమాటే వారికి పెద్ద ఆటంబాంబులా వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులు కొంత సాయం చేసినప్పటికీ, ఫలితం లేదు. తమను ఆదుకునే వారే లేరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆవేదన చెందుతున్నారు.
దయగల దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను రక్షించాలని కోరుతున్నారు. తగిన సహాయం అందుతుందనే ఆశతో వారు రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. దయచేసి విరాళం అందించండి!! తమ నవజాత శిశువును కాపాడండి అని వేడుకుంటున్నారు. (అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment