పాలకొండ: శ్రీకాకుళం జిల్లా ఉనుకూరు మాజీ ఎమ్మెల్యే పాలవలస రుక్మిణమ్మ (89) శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలకొండ మండలం వడమలో 1929లో జన్మించిన రుక్మిణమ్మ 1944లో వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పాలవలస సంగన్నాయుడును వివాహం చేసుకున్నారు. 1952లో పాలకొండ నుంచి, 1962లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయన 1970లో మృతి చెందడంతో రుక్మిణమ్మ 1972లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1980లో పాలకొండ సమితికి తొలి ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. రుక్మి ణమ్మ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా, వ్యవహరిస్తుండగా, మనుమరాలు రెడ్డి శాంతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే రుక్మిణమ్మ కన్నుమూత
Published Wed, May 30 2018 2:11 AM | Last Updated on Wed, May 30 2018 2:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment