rukminamma
-
మాజీ ఎమ్మెల్యే రుక్మిణమ్మ కన్నుమూత
పాలకొండ: శ్రీకాకుళం జిల్లా ఉనుకూరు మాజీ ఎమ్మెల్యే పాలవలస రుక్మిణమ్మ (89) శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలకొండ మండలం వడమలో 1929లో జన్మించిన రుక్మిణమ్మ 1944లో వీరఘట్టం మండలం నీలానగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు పాలవలస సంగన్నాయుడును వివాహం చేసుకున్నారు. 1952లో పాలకొండ నుంచి, 1962లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సంగన్నాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన 1970లో మృతి చెందడంతో రుక్మిణమ్మ 1972లో ఉనుకూరు నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. 1980లో పాలకొండ సమితికి తొలి ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. రుక్మి ణమ్మ కుమారుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పాలవలస రాజశేఖరం వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహరాల కమిటీ సభ్యుడిగా, వ్యవహరిస్తుండగా, మనుమరాలు రెడ్డి శాంతి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
15 తులాల బంగారు నగల చోరీ
అనంతపురం సెంట్రల్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి పర్సులోని 15 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన రుక్ష్మిణమ్మ అనంతపురంలోని వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న బంధువుల ఇంటికి వచ్చేందుకు జనవరి 31న ఆర్టీసీ బస్సులో వచ్చింది. అనంతపురం బస్టాండులో బస్సు దిగే సమయంలో పర్సులోని బంగారు నగలను ఎవరో అపహరించారు. బాధితురాలు శుక్రవారం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ వెంకటేశులు తెలిపారు. -
క్షమాభిక్షకు నోచుకోని 'జైలు పక్షులు'
ఈమె గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రుక్మిణమ్మ. వయస్సు 85 ఏళ్లు. మనమలు, మనమరాళ్లను ఆడిస్తూ హాయిగా శేషజీవితం గడపాల్సిన వయస్సది. కానీ క్షణికావేశంలో చేసిన తప్పునకు 15 ఏళ్లుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో మగ్గిపోతోంది. ఈమె కోడలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో ఆమె కొడుకు ఇదే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాన్నమ్మా...అమ్మమ్మ పిలుపులకు నోచుకోకుండా బాధను దిగమింగుతూ ప్రభుత్వ క్షమాభిక్ష కోసం ఆశగా రుక్మిణమ్మ ఎదురుచూస్తోంది. జైలుకొచ్చిన ప్రతి అధికారిని క్షమాభిక్ష పెట్టాలని వేడుకుంటున్నా కరికరించడం లేదు. రుక్మిణమ్మలాగే మరో నలుగురు మహిళలు, పురుషుల కారాగారంలో దాదాపు 60 మంది వరకూ ఇలాంటి కేసులలో శిక్ష అనుభవిస్తున్నారు. తెలిసో, తెలియకో తప్పుచేశాం... వృద్ధాప్యంలోనైనా కుటుంబ సభ్యులతో కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కోటగుమ్మం : ఖైదీల పాలిట 498(ఎ) శాపంగా మారుతోంది. మహిళలకు రక్షణగా ఉండాల్సిన చట్టం కొన్ని సందర్భాలలో దుర్వినియోగం అవుతోందని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహం చేసుకున్న మహిళను వేధింపులకు గురిచేసినా, వరకట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలలో భర్తతో పాటు అతని తరఫు వారిపై 498(ఎ) కేసులు నమోదు అవుతున్నాయి. ఏడు సంవత్సరాలు నిండకుండా భార్య అత్తవారింట్లో ఆత్మహత్యకు పాల్పడితే 498(ఎ) కేసుగా నమోదు చేస్తారు. దీనిలో అమ్మాయి తరఫు వారు, భర్తతో పాటు, అత్త,మామా, ఆడపడుచులు, మరుదులు, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కేసులో నేరం రుజువైతే జీవిత ఖైదీ విధిస్తారు. అయితే జైల్ నిబంధనల ప్రకారం ఖైదీలు ఏడు సంవత్సరాలు కఠిన శిక్ష అనుభవిస్తే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మూడేళ్లు రెమ్యూషన్ కలిపి 10 సంవత్సరాలు శిక్ష అనుభవించినట్టుగా పరిగణించి ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తుంది. అయితే 498(ఏ) కేసుల్లో శిక్ష పడ్డ ఖైదీలకు ప్రభుత్వ క్షమా భిక్ష ప్రసాదించకపోవడం వలన ఏళ్ల తరబడి ఖైదీలు జైల్లోనే మగ్గిపోతున్నారు. రాజమండ్రి మహిళా కారాగారంలో వివిధ కేసుల్లో శిక్ష పడ్డవారికి ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నప్పటికీ 498(ఏ) కేసుల్లో శిక్ష పొందుతున్నవారు క్షమాభిక్షకు నోచుకోవడం లేదు. కరుడు కట్టిన నేరస్తులను, బాంబ్ బ్లాస్టింగ్ కేసులలో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే ప్రభుత్వం వరకట్నం వేధింపుల కేసులలో శిక్షపడిన నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని పేర్కొంటున్నారు. జైల్లోనే మగ్గిపోతున్న కుటుంబాలు వరకట్నం వేధింపుల కేసులో మృతురాలి భర్తతో పాటు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేయడంతో అందరూ జైల్లోనే మగ్గిపోతున్నారు. ఈ లాంటి కేసులలో శిక్ష పడిన ఖైదీలకు తిరిగి నేరం చేయడని నిర్ధారణకు వచ్చిన ఖైదీలకు, వృద్ధాప్యంలో ఉన్న ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించాలని మానవ హక్కుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో వ్యాధులతో ఉన్న వారిని జైల్లోనే మృతి చెందేవరకూ ఉంచే కంటే మానవతా దృక్పథంతో విడుదల చేయాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్‌ను విడుదల చేయాలి ప్రభుత్వం రెండు దఫాలుగా ఖైదీల విడుదలలో నిబంధనలు విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను హత్య చేసిన కేసులలోను, మహిళా వేధింపుల కేసులో శిక్షపడిన ఖైదీలను విడుదల చేయడంలేదు. మానసిక పరివర్తన చెందిన ఖైదీలను రూ.25 వేల బాండ్ తీసుకొని వదిలే ప్రభుత్వం మహిళా వేధింపుల కేసులలో కూడా వృద్ధులపై సానుభూతితో వ్యవహరించాలి. మానసిక పరివర్తన చెందిన సీనియర్ సిటిజన్స్ విడుదల చేయాలి. - ముప్పాళ్ల సుబ్బారావు, మానవ హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు. -
వాంతులు, విరేచనాలుతగ్గితే ఒట్టు!
వంగూరు, న్యూస్‌లైన్: పక్షం రోజులుగా చారకొండ గ్రామస్తులను ముప్పుతిప్ప లు పెడుతున్న వాంతులు, విరేచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండురోజులుగా అతిసార మళ్లీ విజృంభించడంతో స్థానికులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేసినా వ్యాధి ఎంతమాత్రం అదుపులో కి రావడం లేదు. కడుపుకు తిండిలేక.. ఒంట్లో సత్తువలేక బాధితులు స్థానిక వై ద్యం శిబిరంలో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. శనివారం మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీ రిలో రఘు, లక్ష్మణ్, లక్ష్మమ్మ, బుజ్జి, తేజ స్విని, ధోని, నిఖిల్, శివప్రసాద్ ఉన్నారు. వీరు స్థానిక శిబిరంలో వైద్యచికిత్సలు పొందుతున్నారు. ఇదిలాఉండగా, గతరెండు రోజులుగా వ్యాధి బారినపడిన 11 మంది కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ప్రధానంగా చారకొండ పరిసర గ్రామాలైన మర్రిపల్లి, రాంపూర్, తుర్కలపల్లి, శాంతిగూడెం, సిరసనగండ్ల గ్రామాల్లోనే అతిసారవ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రా మంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం కొనసాగుతూనే ఉంది. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి: డీఎంహెచ్ఓ ప్రధానంగా తాగునీరు కలుషితం కావ డం వల్లే అతిసారవ్యాధి వ్యాప్తి చెందుతుందని, చారకొండ గ్రామంలోని స్కీం బోర్ల నుంచి గాని, వాటర్ ట్యాంకుల నుంచి గాని నీటిని సరఫరా చేయకుండా నేరుగా ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మ అ ధికారులకు సూచించారు. శనివారం ఆ మె చారకొండ గ్రామాన్ని సందర్శించి వై ద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరీక్షించారు. అనంతరం గ్రామ శి వారులో పైప్లైన్ల లీకేజీలతో ఏర్పడిన మురుగుకాల్వలను పరిశీలించారు. ఆ త రువాత స్థానికులు, బాధితులతో మాట్లాడారు. కలుషితమైన నీటిని తాగడం, ఆ హారలోపాల వల్లే అతిసార ప్రబలుతుం దన్నారు. చారకొండతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లు, ఫి ల్టర్ వాటర్ప్లాంట్ల నీటి శాంపిల్స్‌ను ప రీక్షించేందుకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేకబృందం వస్తుందని ఆమె వివరించారు. వైద్యులు పట్టించుకోవడంలేదు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుై రె వైద్య శిబిరం వద్దకు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతిసార బాధితులు, గ్రామస్తులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదుచేశారు. రెండుమందు గోళీలు ఇచ్చి రెఫర్ టు క ల్వకుర్తి అంటూ 108 ద్వారా కల్వకుర్తి ప్ర భుత్వాసుపత్రికి పంపిస్తున్నారని స్థానికు లు వాపోయారు. దీంతో ఆమె సిబ్బం దిపై అసహనం వ్యక్తంచేశారు. అవసరమైతే మరికొంత మంది సిబ్బందిని ఏ ర్పాటు చేసుకుని ఇక్కడికివచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి తీవ్రత ఉంటే తప్ప రె ఫర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తనకు ఫోన్ చేయమని గ్రామస్తులకు సూ చించారు. డీఎంహెచ్ఓను కలిసిన వారి లో చారకొండ సర్పంచ్ శిల్పాదేవీలాల్, గ్రామస్తులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు. -
వామ్మో.. స్వైన్‌ఫ్లూ!
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: ప్రాణాంతక స్వైన్‌ఫ్లూ వ్యాధి పేరు వింటేనే మండలంలోని మాటూరు వాసులు హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన ఓ మహిళ వ్యాధిబారినపడి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామానికి చెందిన శెట్టి వీరమణి (45) గత 15 రోజులుగా దగ్గు, జ్వరం, తలనొప్పితో బాధపడుతుంది. అయితే ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి 20 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలకు విహారయాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్సచేయించారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈనెల 14న హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలు నిర్వహించిన అక్కడి వైద్యులు వీరమణికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని నిర్ధారించారు. అయితే వెంటనే అక్కడి వైద్యులు జిల్లా వైధ్యాధికారులకు సమాచారమిచ్చారు. గ్రామాన్ని సందర్శించి జిల్లా వైద్యాధికారులు మాటూరు గ్రామంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకి ఓ మహిళ అస్వస్థతకు గురికావడంతో జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మతో పాటు, జిల్లా వైద్యసిబ్బంది గ్రామాన్ని సందర్శించి వీరమణి కుటుంబసభ్యులకు మందులు పంపిణీచేశారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా ఆదివారం నుంచి గ్రామంలో క్యాంపుఏర్పాటు ఏర్పాటుచేయాలని స్థానిక వైద్యాధికారులకు ఆదేశించారు. డీఐఓ వెంకట రంగారావు, ఎస్పీహెచ్ఓ లలిత గ్రామాన్ని సందర్శించా రు. వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వరం, దగ్గు, తలనొప్పితో బాధపడేవారి వివరాలను సేకరించింది.