- కిమ్స్ వైద్య పట్టభద్రుల ప్రదానోత్సవంలో డాక్టర్ రమేష్ సి. డేకా
వైద్యవిధానంలో మార్పులు రావాలి
Published Sat, Apr 8 2017 11:24 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
అమలాపురం రూరల్ :
ప్రస్తుతం వస్తున్న రోగాలకు అనుగుణంగా వైద్యవిధానంలో మార్పులు రావాలని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, అస్సాం డౌ¯ŒSటౌ¯ŒS వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్.సి.డేకా అభిప్రాయపడ్డారు. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ఏడవ వైద్య పట్టభద్రుల ప్రదానమహోత్సవం శనివారం రాత్రి డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. డేకా మాట్లాడుతూ వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని, యువ వైద్యులు చట్టబద్ధమైన, సర్వసమ్మతమైన వైద్యవిధానాలను అనుసరించి రోగులకు సేవలందించాలన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ వి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత గ్రామీణ ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొనడంలో యువ వైద్యుల పాత్ర ముఖ్యమైందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు మాట్లాడుతూ నిట్ పరీక్ష విధానంలో ఎంసీఐ ద్వారా ఎన్టీఆర్ యూనివర్సిటీకి గుర్తింపు లభించిందన్నారు. కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ తమ విద్యాలయం ద్వారా ఇప్పటి వరకు ఏడు బ్యాచ్‌ల యువ వైద్యులను సమాజానికి అందించామన్నారు. డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్ యువ వైద్యులతో ప్రమాణం చేయించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా 11 స్వర్ణపతకాలు సాధించిన డాక్టర్ పావనీ ప్రియాంకను సత్కరించారు. అనంతరం 12వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, గైట్ ఎండీ శశికిరణ్‌వర్మ, సీఈవో రఘు పాల్గొన్నారు.
Advertisement
Advertisement