doctor ramesh
-
కోర్టును ఆశ్రయించిన డాక్టర్ రమేష్
సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనపై ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ రమేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణను జిల్లా కోర్టు ఈ నెల 21కు వాయిదా వేసింది. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది. (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!) -
డాక్టర్ మమత నుంచి కీలక అంశాలు రాబట్టాం..
సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్ మమతను ఆరు గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. మృతుల బంధువుల ఆరోపణలపై ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. సుమారు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలపై డాక్టర్ మమతను ఏసీపీ సూర్యచంద్రరావు ప్రశ్నించారు. కోవిడ్ కేర్ సెంటర్లో రమేష్ ఆసుపత్రి వసూలు చేస్తున్న ఫీజులపై వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం డాక్టర్ మమత మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరు అయినట్లు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, తనను పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. కీలక అంశాలు రాబట్టాం.. ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ.. ‘స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పదిమందికి నోటీసులు ఇచ్చాం. ఇవాళ డాక్టర్ మమత విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టాం. డాక్టర్ మమత అగ్ని ప్రమాదం జరిగిన రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా చూసారు. ఆమెను ఇంకా విచారణ చేయాల్సి ఉంది. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు రమేష్ ఆసుపత్రి సిబ్బందిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. విచారణ సోమవారానికి వాయిదా పడింది. వారిని కస్టడీకి తీసుకుని వారి నుంచీ సేకరించాల్సిన వివరాలు చాలా ఉన్నాయి. కోవిడ్ పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న వారంతా విచారణకు సహకరిస్తారని భావిస్తున్నాం. విచారణకు సహకరించకపోతే సెక్షన్ 171 ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుంది’ అని తెలిపారు. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. (అగ్ని ప్రమాద ఘటన: విచారణ వేగవంతం..) -
వైద్యవిధానంలో మార్పులు రావాలి
కిమ్స్ వైద్య పట్టభద్రుల ప్రదానోత్సవంలో డాక్టర్ రమేష్ సి. డేకా అమలాపురం రూరల్ : ప్రస్తుతం వస్తున్న రోగాలకు అనుగుణంగా వైద్యవిధానంలో మార్పులు రావాలని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్, అస్సాం డౌ¯ŒSటౌ¯ŒS వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేష్.సి.డేకా అభిప్రాయపడ్డారు. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ఏడవ వైద్య పట్టభద్రుల ప్రదానమహోత్సవం శనివారం రాత్రి డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. డేకా మాట్లాడుతూ వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని, యువ వైద్యులు చట్టబద్ధమైన, సర్వసమ్మతమైన వైద్యవిధానాలను అనుసరించి రోగులకు సేవలందించాలన్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ వి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత గ్రామీణ ప్రజారోగ్య సమస్యలు ఎదుర్కొనడంలో యువ వైద్యుల పాత్ర ముఖ్యమైందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు మాట్లాడుతూ నిట్ పరీక్ష విధానంలో ఎంసీఐ ద్వారా ఎన్టీఆర్ యూనివర్సిటీకి గుర్తింపు లభించిందన్నారు. కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ తమ విద్యాలయం ద్వారా ఇప్పటి వరకు ఏడు బ్యాచ్‌ల యువ వైద్యులను సమాజానికి అందించామన్నారు. డీ¯ŒS ఏఎస్ కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ జీకేవీ ప్రసాద్ యువ వైద్యులతో ప్రమాణం చేయించారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా 11 స్వర్ణపతకాలు సాధించిన డాక్టర్ పావనీ ప్రియాంకను సత్కరించారు. అనంతరం 12వ వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కిమ్స్ ఎండీ, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, గైట్ ఎండీ శశికిరణ్‌వర్మ, సీఈవో రఘు పాల్గొన్నారు. -
ప్రసూతి వార్డులో పాము!
-
ప్రసూతి వార్డులో పాము!
పెందుర్తి/సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రంలోకి భారీ పాము చొరబడింది. ఆదివారం ఉదయం వైద్యుడు రమేష్ సహా కిందిస్థాయి సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఇదే సమయంలో కాన్పు కోసం ఓ మహిళ వచ్చింది. అయితే కేసు ఇబ్బందికరంగా ఉండడంతో ఆ మహిళను కేజీహెచ్‌కు పంపేశారు. అనంతరం గదులను శుభ్రపరిచేందుకు స్వీపర్లు సిద్ధమవుతుండగా ప్రసూతి వార్డులోని ఓ మంచం కింద పాము ఉండడాన్ని గమనించి పరుగులు తీశారు. స్థానికులు దానిని హతమార్చారు. ఇది ప్రమాదకరమైన పొడపాము జాతికి చెందినదని, ఇది కాటేస్తే మనిషి బతకడం కష్టమని, బతికినా జీవితాంతం మందులు వాడాల్సిందేనని స్థానికులు తెలిపారు.