అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
రాంగోపాల్‌పేట్: అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు ఆహుతి ప్రసాద్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యతో బాధ పడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రసాద్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రసాద్ త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.