
భువనేశ్వర్: ఒడియా చలనచిత్ర నటుడు బాబూసాన్ మహంతి శనివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో అనారోగ్యానికి గురై శుక్రవారం అసుపత్రిలో చేరారు. భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరుగురు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించారు. బాబూ సాన్ ఆరోగ్యం క్రమంగా కోలుకోవడంతో ఆయన భార్య తృప్తి సత్పతి ఆసుపత్రికి చేరుకొని నటుడిని ఇంటికి తీసుకెళ్లింది.
అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల కారణంగా బాబూషాన్, తృప్తి విడివిడిగా నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె ఆసుపత్రికి వచ్చి తన భర్తను అత్తవారింటికి తీసుకెళ్లింది. కాగా ధామన్ చిత్రం షూటింగ్ పురస్కరించుకుని బాబూసాన్ లడక్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలించక పోవడంతో ఆక్సిజన్ స్థాయి దిగజారి, అస్వస్థతకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment