
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఎప్పుడో పొరపాటున మింగిన 25 పైసల నాణేన్ని వైద్యులు కుట్టు కోత లేకుండా తొలగించి ఓ వృద్ధుడి ప్రాణాన్ని కాపాడారు. ఎల్.సాయిబాబు (77) అనే వృద్ధుడు 30 ఏళ్ల క్రితం 25 పైసల నాణేన్ని పొరపాటున మింగేశాడు. అయితే ఆ విషయాన్ని అతడు అంతటితో మర్చిపోయాడు. కొద్ది కాలం నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర జ్వరంతో బాధపడుతూ విశాఖ షీలానగర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించాడు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల్లో 25 పైసల నాణెం ఉన్నట్లు గుర్తించారు. బ్రాంకోస్కోపీ ద్వారా పొడవైన ఫ్లెక్సిబుల్ ట్యూబ్‌కు కెమెరాను అమర్చి, ట్యూబ్‌ను ఉపిరితిత్తుల ద్వారా పంపించి నాణేన్ని తొలగించామని పల్మనాలజిస్ట్ డాక్టర్ కె.ఎస్.ఫణీంద్ర కుమార్ తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment