హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు డ్యాన్స్ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్, దిశా పటాని నటించిన "రాధే" చిత్రంలోని సీటీ మార్ పాటకు వైద్యులు డ్యాన్స్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను బాలీవుడ్ భామ దిషా పటాని ఫ్యాన్స్ క్లబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. 35,515 మంది నెటిజన్లు వీక్షించారు. డాక్లర్లు చేసిన డ్యాన్స్‌ని మెచ్చుకుంటూ నెటిజన్లు తమ ప్రేమను పంచుకుంటున్నారు. దీనిపై దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది. "మా ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులకు ధన్యవాదాలు" అని ఓ నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "మీరు నిజమైన హీరోలు. మీ డ్యాన్స్ చాలా బాగుంది." అంటూ మరో నెటిజన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
(చదవండి: వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్‌లు షాక్!)
Comments
Please login to add a commentAdd a comment