పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ కూడా కారణమని పోలీసులు ఇరువురిపైనా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో థియేటర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. థియేటర్ లైసెన్సు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. దీనిపై సంధ్య థియేటర్ యాజమాన్యం ఆదివారం స్పందించింది. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొంది.
గత 45 ఏళ్లుగా థియేటర్ నడుపుతున్నామని ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు 80 మంది విధుల్లో పాల్గొన్నారంది. డిసెంబర్ 4, 5వ తేదీల్లో మైత్రీ మూవీస్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకుందని, గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్‌కు వచ్చారంది. తమ దగ్గర ద్విచక్రవాహనం, ఫోర్ వీలర్‌కు ప్రత్యేక పార్కింగ్ ఉందని వివరించింది. ఈ మేరకు ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపించారు.
చదవండి: చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి
Comments
Please login to add a commentAdd a comment